ETV Bharat / entertainment

కూచిపూడి డ్యాన్స్​తో సితార సర్​ప్రైజ్​​.. అమితానందంలో మహేశ్​ - మహేశ్​బాబు కూతురు సితార డ్యాన్స్​

Maheshbabu daughter kuchipudi dance: శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ హీరో మహేశ్​బాబు.. తన కూతురు సితారకు సంబంధించిన ఓ స్పెషల్​ వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో సితార కూచిపూడి డ్యాన్స్​ వేసి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.

mahesh sitara
మహేశ్​ సితార
author img

By

Published : Apr 10, 2022, 12:54 PM IST

Updated : Apr 10, 2022, 4:20 PM IST

Maheshbabu daughter kuchipudi dance: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అమితానందంలో ఉన్నారు. తన ముద్దుల కుమార్తె సితార ప్రతిభను చూసి ఎంతో సంతోషిస్తున్నారు. కుమార్తెపై ప్రశంసల వర్షం కురిపిస్తూ వరుస ట్వీట్లు చేశారు. సితారకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే ఎంతో ఇష్టం. వెస్ట్రన్‌, సంప్రదాయ నృత్యాల్లో శిక్షణ తీసుకుంటోంది. వెస్ట్రన్‌ డ్యాన్స్‌లకు సంబంధించిన పలు వీడియోలను సైతం ఆమె తరచూ సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంటోంది. కాగా, ఆదివారం ఉదయం నెటిజన్లలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ మహేశ్‌ ఓ స్పెషల్‌ మీడియా షేర్‌ చేశారు.

"సితార తొలి కూచిపూడి నృత్య ప్రదర్శన వీడియో ఇది. పరమ పవిత్రమైన శ్రీరామనవమి రోజున ఈ వీడియోను మీ అందరితో పంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. సీతూ పాప.. చేసే ప్రతి పనిపట్ల నువ్వు చూపించే శ్రద్ధ చూస్తుంటే నాకెంతో ముచ్చటగా ఉంది. నువ్వు నన్ను మరింత గర్వపడేలా చేస్తున్నావు. మా పాపకు డ్యాన్స్‌లో శిక్షణ ఇచ్చిన అరుణ భిక్షు, మహతి భిక్షులకు నా ధన్యవాదాలు" అని మహేశ్‌ రాసుకొచ్చారు. మరోవైపు నమ్రత సైతం సితార డ్యాన్స్‌ వీడియోని షేర్‌ చేస్తూ.. ఆనందంతో కన్నీళ్లు వచ్చేస్తున్నాయంటూ తన సంతోషాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఇదీ చూడండి: ఇంట్రెస్టింగ్​ టైటిల్​తో అల్లరి నరేశ్.. సూపర్​ సాంగ్​తో మాస్ మాహారాజా

Last Updated : Apr 10, 2022, 4:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.