Mahesh babu birthday celebrations : మరో మూడు రోజుల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులు సంబరాలు చేసుకునే రోజు వచ్చేస్తోంది. అదే ఆగస్ట్ 9 ఆయన పుట్టినరోజు. ఆ రోజు మహేశ్ 48వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే మహేశ్ గత కొన్నేళ్లుగా తన పుట్టిన రోజు వేడుకలను విదేశాల్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సారి కూడా విదేశాల్లోనే జరుపుకోబోతున్నారని తెలిసింది. ట
ఇటీవలే ఓ రెండు వారాల క్రితం తన కుటుంబంతో కలిసి మహేశ్ ఫారెన్ టూర్ లండన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మహేశ్ లండన్ నుంచి స్కాట్లాండ్కు వెళ్లారట. స్కాట్లాండ్లోని గ్లెన్ఈగల్స్ అనే గోల్ఫ్ రిసోర్ట్‌లో ఉన్నట్లు తెలిసింది. అక్కడే తన ఫ్యామీలితో కలిసి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను జరుపుకోవాలని నిర్ణయించుకున్నారట.
ఈ బర్త్‌డే వేడుక అయిపోగానే మరో వారం రోజుల పాటు అక్కడే ఉండి.. 16వ తేదీన ఆయన తిరిగి వస్తారని తెలుస్తోంది. వచ్చాక త్రివిక్రమ్ గుంటూరు కారం షూటింగ్లో పాల్గొంటారట. 20వ తేదీ నుంచి సెట్లో అడుగుపెడతారట.
Trivikram mahesh babu Gunturu karam movie : అయితే గుంటూరు కారం సినిమా చిత్రీకరణ మొదటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే సినిమాటోగ్రాఫర్ తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కొత్త సినిమాటోగ్రాఫర్‌ను వీలైనంత త్వరగా ఫైనలైజ్ చేసి 11 లేదా 12 నుంచి చిత్రీకరణ మొదలు పెట్టాలని చూస్తున్నారట. హీరో కాకుండా ఇతర నటీనటులపై షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
Mahesh rajamouli movie SSMB 29 : ఇంకా మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు మంచి సర్‌ప్రైజ్ కూడా ఇవ్వాలని మూవీటీమ్ ప్లాన్ చేస్తోందని తెలిసింది. సినిమాలోని మొదటి పాటను రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. దీంతో దర్శకధీరుడు రాజమౌళి-మహేశ్ కాంబోలో రాబోయే సినిమా గురించి కూడా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని అంతా ఆశిస్తున్నారు.
ఇదీ చూడండి :
Rajamouli Mahesh babu movie : ఆ రోజు సర్‌ప్రైజ్ ఇవ్వనున్న రాజమౌళి!
Gunturu Karam Shooting : మహేశ్ తిరిగొచ్చేస్తున్నాడహో.. ఆ రోజు నుంచే షూటింగ్ షురూ..