ETV Bharat / entertainment

Lokesh Kanagaraj Injured : 'లియో' ప్రమోషన్స్​లో తొక్కిసలాట.. లోకేశ్​ కనగరాజ్​కు గాయం.. అన్నీ వాయిదా! - డైరెక్టర్​ లోకేశ్​ కనగరాజ్​కు గాయం వార్తలు

Lokesh Kanagaraj Injured : 'లియో' మూవీ డైరెక్టర్​ లోకేశ్​ కనగరాజ్​ గాయపడ్డారు. మూవీ ప్రమోషన్స్​లో భాగంగా కేరళలోని పాలక్కడ్​ జిల్లాకు వెళ్లిన ఆయనకు ఈ చేదు అనుభవం ఎదురైంది.

Lokesh Kanakaraj Injured In Stampede In Kerala Police Lathi Charged Fans
Leo Director Lokesh Kanagaraj Injured
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 24, 2023, 4:24 PM IST

Updated : Oct 24, 2023, 5:06 PM IST

Lokesh Kanagaraj Injured : నాలుగు భాషల్లో విడుదలై సూపర్​హిట్​ టాక్​ను అందుకున్న 'లియో' సినిమా దర్శకుడు లోకేశ్​ కనగరాజ్​ గాయపడ్డారు. సినిమా ప్రమోషన్స్​లో భాగంగా కేరళ పాలక్కడ్​ జిల్లాలోని ఓ థియేటర్​కు మంగళవారం వెళ్లిన ఆయనకు ఈ చేదు అనుభవం ఎదురైంది.

అసలేం జరిగిందంటే?
జిల్లాలోని ఆరోమా థియేటర్​లో ఏర్పాటు చేసిన ప్రమోషన్స్​లో పాల్గొనేందుకు లోకేశ్​ కనగరాజ్ వెళ్లారు. దీంతో డైరెక్టర్​ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయనతో కలిసి సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ఆ సమయంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కనగరాజ్​ కాలికి గాయమైంది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

  • Thank you Kerala for your love.. Overwhelmed, happy and grateful to see you all in Palakkad. ❤️

    Due to a small injury in the crowd, I couldn’t make it to the other two venues and the press meeting. I would certainly come back to meet you all in Kerala again soon. Till then… pic.twitter.com/JGrrJ6D1r3

    — Lokesh Kanagaraj (@Dir_Lokesh) October 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఫ్యాన్స్​పై లాఠీఛార్జ్​..
మరోవైపు లోకేశ్​ను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్​ను నిలువరించే క్రమంలో అక్కడే ఉన్న పోలీసులు వారిపై లాఠీఛార్జ్​ చేశారు. దర్శకుడు లోకేశ్​ కనగరాజ్​ వస్తున్నారని తెలిసి కేరళలోని సినిమా డిస్ట్రిబ్యూటర్లు పూర్తిస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ అభిమానులు అవేవీ పట్టించుకోకుండా లోకేశ్​ను చూసేందుకు ఎగబడ్డారు.

  • #WATCH | Palakkad, Kerala: Leo movie director Lokesh Kanagaraj cancelled his two programs in Kerala after he was injured in the crowd when reached Aroma Theatre, Palakkad. A large number of people gathered outside the theatre to see him. pic.twitter.com/IoQvVJNGL4

    — ANI (@ANI) October 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రెస్​ మీట్​ వాయిదా..
అయితే పాలక్కడ్​తో పాటు కొచ్చి, త్రిస్సూర్​ జిల్లాల్లోని థియేటర్లకు కూడా మూవీ ప్రమోషన్స్​ కోసం లోకేశ్​ వెళ్లాల్సి ఉంది. అయితే గాయం కారణంగా వాటిని రద్దు చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అలాగే కొచ్చిలో జరగాల్సిన ప్రెస్ మీట్​ను కూడా వాయిదా వేశారు. వాటికి సంబంధించిన వివరాలను తన ట్విట్టర్​ ఖాతాలో షేర్​ చేశారు. అభిమానులతో దిగిన ఓ ఫొటోను కూడా యాడ్​ చేశారు.

"థ్యాంక్యూ కేరళ ఫర్​ యూవర్​ లవ్​.. పాలక్కడ్‌లో ఇంత భారీ స్థాయిలో మిమ్మల్నందరినీ ఇలా చూసినందుకు సంతోషంగా ఉంది. నన్ను చూసేందుకు వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో నా కాలికి చిన్న గాయమైంది. ఈ కారణంతోనే నేడు కేరళలో జరగాల్సిన మిగతా రెండు ప్రమోషన్స్​తో పాటు ప్రెస్​ మీట్​కు హాజరుకాలేకపోతున్నా. త్వరలోనే మీ అందరినీ కలవడానికి నేను కచ్చితంగా మళ్లీ కేరళకు వస్తాను. అప్పటివరకు ఇదే ప్రేమతో​తో లియోను ఎంజాయ్​ చేయండి"

- లోకేశ్​ కనగరాజ్​, లియో డైరెక్టర్​.

అందుకే ఈ స్పెషల్​ ట్రిప్​..
లోకేశ్​ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లియో' సినిమా దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా కేరళలో కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్​ వద్ద సునామీ సృష్టిస్తోంది. కేవలం ఈ రాష్ట్రంలోనే సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే అనూహ్యంగా రూ.25 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ విశేష ఆదరణ కారణంగానే కేరళ ఫ్యాన్స్​ కోసం డైరెక్టర్​ లోకేశ్​ ఈ స్పెషల్​ ట్రిప్​ను ప్లాన్​ చేసినట్లుగా తెలిసింది. ఇందులో భాగంగానే అక్టోబర్​ 24న కేరళలోని కొన్ని థియేటర్లను ఆయన సందర్శించాలని అను​కున్నారు. కాగా, ఇప్పటికీ లియో సినిమా నడిచే కేరళ థియేటర్లన్నీ హౌస్​ ఫుల్​ బోర్డ్​లతో దర్శనమిస్తున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Mahesh Daughter Sithara Photoshoot : దసరా వైబ్స్​.. చందమామే అసూయ పడేలా ముస్తాబైన సితారా పాప!

Bhagavanth Kesari Vs LeO Vs Tiger Nageswarao Collections : దసరా రోజు దుమ్ములేపిన కలెక్షన్స్​.. ఎంతొచ్చాయంటే?

Last Updated : Oct 24, 2023, 5:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.