ETV Bharat / entertainment

ఈ సినిమా కోసం నా సర్వస్వం ఇచ్చేశా - లైగర్​ సినిమా అప్​డెట్​

విజయ్​ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్​ దర్శకత్వంలో వస్తున్న చిత్రం లైగర్​. పాన్​ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదలకు సిద్ధమైంది. ఈ తరుణంలోనే సోమవారం మీడియాతో మాట్లాడారు విజయ్. ఈ సందర్భంగా విజయ్‌ పంచుకున్న చిత్ర విశేషాలు మీ కోసం

liger latest update
liger latest update
author img

By

Published : Aug 16, 2022, 6:38 AM IST

Updated : Aug 16, 2022, 7:23 AM IST

"మంచి కథా బలమున్న చిత్రం 'లైగర్‌'. ఇది శారీరకంగా, మానసికంగా నాకు సవాల్‌ విసిరింది" అన్నారు విజయ్‌ దేవరకొండ. ఆయన హీరోగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా సినిమా ఇది. పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అనన్య పాండే కథానాయిక. ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్‌ చిత్ర విశేషాలు పంచుకున్నారు.

ప్రాంతీయ చిత్రంగానే..: 'లైగర్‌'ను తొలుత తెలుగులోనే తెరకెక్కించాలనుకున్నాం. అయితే అప్పటికే మన తెలుగు సినిమాలు కొన్ని పాన్‌ ఇండియా స్థాయిలో సత్తా చాటాయి. మన కంటెంట్‌ అన్ని భాషల వారినీ ఆకట్టుకుంటుంది కదా.. ఆ రేంజ్‌లో మనమెందుకు చేయకూడదనిపించింది. అలా ప్రాంతీయ సినిమా కాస్తా పాన్‌ ఇండియా చిత్రంగా మారింది. కథ పరంగా ఇది పక్కా తెలుగు సినిమానే. టాకీ పార్ట్‌ను తెలుగు, హిందీ వెర్షన్లలో షూట్‌ చేశాం. ఈ ప్రాజెక్టుకి పని చేసిన సంగీత దర్శకులంతా బాలీవుడ్‌ వారు. అందుకే పాటలన్నీ హిందీలో ఉన్నట్లు అనిపిస్తుంది.

కరణ్‌తో అలా..: నా 'అర్జున్‌ రెడ్డి' నచ్చడం వల్ల కరణ్‌ జోహార్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు. అప్పుడే నాతో సినిమా చేయాలని ఉందని చెప్పారు. తన దగ్గరకు వచ్చే కథల్ని నాకు పంపిస్తానన్నారు. ఓరోజు పూరితో చేస్తున్న ప్రాజెక్ట్‌ గురించి ఆయనకు చెప్పాను. దాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో చేయాలనుందన్నా. కథ వినకుండానే ఈ చిత్రం నిర్మించేందుకు కరణ్‌ ఓకే అన్నారు. దీన్ని చాలామంది 'అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి'తో పోలుస్తున్నారు. కానీ, రెండింటికీ ఏం సంబంధం లేదు. తల్లీకొడుకుల ఎమోషన్‌ ప్రధానంగా సాగే చిత్రమిది. దీంట్లో నా పాత్రకు నత్తి ఉంది. దాన్ని చాలా ఎంజాయ్‌ చేస్తూ చేశా.

ఎంతో శ్రమించా..: ఈ చిత్రం కోసం నేను నా శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నా. దీని కోసం సుమారు 18 నెలలు కష్టపడ్డా. నిజానికి ఈ కథ విన్నప్పుడు నా లుక్‌ మార్చుకోవడానికి రెండు నెలల సమయం కేటాయిస్తే సరిపోతుందిలే అనుకున్నా. అందుకు తగ్గట్లుగానే రెండు నెలల టైమ్‌ అడిగి.. గట్టిగా కష్టపడ్డా. కానీ, బాడీలో ఏ మార్పు కనిపించలేదు. దీంతో లుక్‌ మార్చుకోవడానికి మరింత సమయం కావాలని కోరా. ఈలోపు బాడీ కనిపించకుండా ఉండే సీన్లు అన్నీ షూట్‌ చేసుకుందామని చెప్పా. ఇదే సమయంలో కొవిడ్‌తో గ్యాప్‌ రావడం వల్ల మరింత కష్టపడి లుక్‌ మార్చుకోగలిగా. అలాగే ఫైట్స్‌, డ్యాన్స్‌ నేర్చుకున్నా. ఈ చిత్రం కోసం నేను నా సర్వస్వం ఇచ్చేశా.

"'లైగర్‌' కథ విన్నప్పుడే నేను చాలా ఎగ్జైట్‌ అయ్యా. ఇలాంటి లార్జర్‌ దెన్‌ లైఫ్‌ సినిమాతో దక్షిణాదిలోకి అడుగు పెట్టడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో మా నాన్న చుంకీ పాండే కీలక పాత్ర చేస్తున్నారు. ఆయనతో కలిసి నటించాలని ఎప్పుట్నుంచో అనుకునేదాన్ని. తనేమో మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ చేయమని చెబుతుండేవారు. ఈ చిత్రంతో రెండు కోరికలు తీరాయి".

- అనన్య పాండే, హీరోయిన్​

అమ్మ భయపడింది..: ఈ చిత్రంతో నాకు మైక్‌ టైసన్‌తో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. నా జీవితాంతం మర్చిపోలేని జ్ఞాపకమిది. సినిమాకి ఆయన పాత్ర కీలకం. మైక్‌ టైసన్‌తో సినిమా చేస్తున్నా అన్నప్పుడు అమ్మ భయపడింది. తనకి సినిమా యాక్షన్‌ కొరియోగ్రఫీ గురించి పెద్దగా తెలియదు. టైసన్‌ది మామూలు పర్సనాలిటీ కాదు. తొలిరోజు షూట్‌లో ఆయన్ని చూస్తే భయం వేసింది. తను షేక్‌ హ్యాండ్‌ ఇస్తే పది కేజీల బరువు తాకినట్లు ఉంటుంది. ఆయన మెడ మనకి మూడింతలు ఉంటుంది. తన షూ సైజ్‌ 16. ఎక్కడా దొరకలేదు. మేమే స్పెషల్‌గా తయారు చేశాం. క్లైమాక్స్‌లో పెద్ద ఫైట్‌ సీక్వెన్స్‌ ఉంది.

ఇవీ చదవండి: బిగ్‌బాస్‌ బ్యూటీకి లైంగిక వేధింపులు, ఆవేదనతో పోస్ట్

దృశ్యం నటి గ్లామర్​ ట్రీట్​ ఓవర్​లోడెడ్,​ లంగా జాకెట్​లో మల్లెపూలు పెట్టుకుని

Last Updated : Aug 16, 2022, 7:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.