ETV Bharat / entertainment

Kushi Musical Concert : 'సామ్​ గురించి అప్పుడే తెలిసింది.. ఆమె ముఖంలో నవ్వు చూడాలని..' - ఖుషి మూవీ రిలీజ్

Kushi Musical Concert : టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'ఖుషీ'. సెప్టెంబర్​ 1న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్​ను జోరుగా చేస్తోంది మూవీ టీమ్​. అందులో భాగంగా తాజాగా ఓ మ్యూజికల్​ కాన్సర్ట్​ను చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ విశేషాలు మీ కోసం..

Kushi Musical Concert
Kushi Musical Concert
author img

By

Published : Aug 16, 2023, 7:09 AM IST

Kushi Musical Concert : టాలీవుడ్​ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, సమంత లీడ్​ రోల్స్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'ఖుషి'. 'జిలి'ఫేమ్​ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మూవీ టీమ్​ ప్రమోషన్స్​ను శరవేగం చేస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్‌లో ఓ 'మ్యూజికల్‌ కాన్సర్ట్‌'ను నిర్వహించింది. ఇందులో విజయ్​, సమంత పాల్గొని అభిమానుల్లో ఉత్తేజాన్ని నింపారు. జోడీగా డ్యాన్స్​ కూడా చేశారు. దీన్ని చూసిన ఫ్యాన్స్​ ఆనందంలో మునిగితేలిపోయారు. ఇక ఈవెంట్​లో సమంత గురించి విజయ్​ పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ఇక ఇదే స్టేజ్​ పై సమంతతో పాటు దర్శకుడు శివ నిర్వాణ కూడా మాట్లాడారు.

Vijay Devarakonda About Samantha : "సెప్టెంబరు 1న నా తరఫున 'ఖుషి' తీసుకొస్తున్నాను. మీరంతా నవ్వుతూ బయటకు వచ్చిన సినిమాని ఎప్పుడు ఇచ్చానో నాకు గుర్తులేదు. 'విజయ్‌ బ్రో సెప్టెంబరు 1న నీ ముఖంలో నవ్వు చూడాలని ఉంది. అదొక్కటే గుర్తుపెట్టుకుని పనిచేస్తున్నాను' అని శివ నెల నుంచి చెబుతున్నారు. నా ముఖంలో కాదు సమంత ముఖంలో నవ్వులు చూడాలని ఉంది. ఆమె ఈ సినిమా కోసం ఎంత కష్టపడిందో నేను మాటల్లో చెప్పలేను. గతేడాది ఏప్రిల్‌లో నవ్వుతూనే సినిమాను ప్రారంభించాం. కానీ షూటింగ్​ ఆఖరి దశలో ఉన్న సమయంలోనే సమంత ఆరోగ్యం కాస్త దెబ్బతింది. అయితే స్క్రీన్‌పై బాగానే కనిపిస్తుందని మేము కూడా తేలిగ్గా తీసుకున్నాం. కానీ ఆమె పరిస్థితి తర్వాత అర్థమైంది. కొన్ని రోజులు విరామం తీసుకోమని చెప్పాం. కొన్ని రోజులకు నేను వేరే సినిమా ప్రమోషన్‌లో ఉన్న సమయంలో ఆమె పరిస్థితి గురించి తెలిసింది" అని పేర్కొన్నారు.

Shiva Nirvana About Kushi Movie : "ప్రేమ, పెళ్లి.. ఈ నేపథ్యంలోనే సినిమాలు చేస్తావేంటి అని కొందరు నన్ను అడుగుతుంటారు. అలా ఎందుకు చేస్తున్నానో నాకే తెలియదు. నా భార్యపై నేనెలా ప్రేమను కురిపించానో, మా మధ్య చిన్న చిన్న గొడవలు ఎలా జరిగాయో అదే ఈ కథలో ప్రతిబింబిస్తాయి. మీకు ఈ సినిమా విజయ్‌ దేవరకొండ, సమంత కనిపించరు. వారు పోషించిన పాత్రలు ఆరాధ్య, విప్లవ్‌ మాత్రమే కనిపిస్తాయి. ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని హత్తుకుంటుంది" అని దర్శకుడు శివ నిర్వాణ అన్నారు.

కాన్సర్ట్​లో అదే హైలైట్​...
Samantha Vijay Dance In Kushi Concert : హైదరాబాద్​లో గ్రాండ్​గా జరిగిన ఈవెంట్​లో సమంత-విజయ్​ డ్యాన్స్​ హైలైట్​గా నిలిచింది. 'ఖుషి' టైటిల్​ సాంగ్​కు డ్యాన్స్ చేసిన విజయ్, సామ్.. తమ కెమెస్ట్రీతో అదరగొట్టారు. వీళ్ల డ్యాన్స్ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపింది. వీళ్లిద్దరూ స్టేజ్ పైకి వచ్చే సమయంలోనూ ఖుషీ టైటిల్ సాంగ్ తోనే వచ్చారు. వీళ్ల వెనుక ఖుషీ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఆ పాట పాడుతూ వచ్చారు. ఇక ఆయనతో పాటు బాలీవుడ్ సింగర్ జావెద్ అలీ కూడా ఈ కాన్సర్ట్​లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.