యశ్ కథానాయకుడిగా నటించిన కేజీయఫ్: ఛాప్టర్2 బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ హై వోల్టేజి యాక్షన్ చిత్రానికి కొనసాగింపు ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ పార్ట్-2 చివరిలో హింట్ ఇచ్చారు. దీంతో అభిమానులు 'కేజీయఫ్-ఛాప్టర్3'పై భారీ అంచనాలే పెట్టుకున్నారు.
మరోవైపు ఈ పార్ట్‌లో కథానాయికగా ఎవరు నటిస్తారన్నదానిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. ఛాప్టర్-2లో శ్రీనిధి శెట్టి పాత్ర చనిపోవడంతో ఆ క్యారెక్టర్ ముగిసింది. దీంతో కొత్త హీరోయిన్ అవసరముంది. ఈ క్రమంలో పలువురు బాలీవుడ్ భామలు 'కేజీయఫ్-3'లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ఈ సినిమాలో అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కాలంటే 'కేజీయఫ్'లాంటి ఒక్క చిత్రం చాలు. అదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం స్క్రిప్టు దశలో ఉన్న ఛాప్టర్3 సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు? అనే విషయం ప్రకటించాల్సి ఉంది.
ఓటీటీలో కంగన 'ధాకడ్': బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్ కెరీర్‌లో అతి పెద్ద ఫ్లాప్ మూవీ 'ధాకడ్'. మే 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. రజనీష్ ఘయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ సగటు ప్రేక్షకుడిని మెప్పించటంలో విఫలమైంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. జీ5 ఓటీటీలో జులై 1వ తేదీ నుంచి 'ధాకడ్' స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమాలో కంగన.. ఏజెంట్ అగ్ని పాత్రలో కనిపించారు. మానవ అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో ఏజెంట్ అగ్ని.. అతి క్రూరుడైన ప్రతినాయకుడు రుద్రవీర్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది? మరి అతడిని ఎలా ఎదుర్కొంది? అందుకు ఏం చేసింది? అన్నది చిత్ర కథ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: రణ్‌బీర్ పోస్టర్‌పై ఆలియా 'హాట్' కామెంట్.. ఆసక్తికరంగా '7 డేస్ 6 నైట్స్' ట్రైలర్