ETV Bharat / entertainment

కత్రినకు అలాంటి సినిమాలు చేయాలని ఉందట! - సౌత్ ఇండస్ట్రీపై కత్రినా కైఫ్​ ప్రశంసలు

బాలీవుడ్ అందాల తార కత్రినా కైఫ్‌ తాజాగా తన మనసులోని ఓ మాటను బయటపెట్టింది. ఆ చిత్రాల్లో నటించాలని ఉందని చెప్పింది.

katrina kaif praises on south industry
సౌత్ ఇండస్ట్రీపై కత్రినా కైఫ్​ ప్రశంసలు
author img

By

Published : Oct 26, 2022, 5:03 PM IST

బాలీవుడ్​ బ్యూటీ కత్రినా కైఫ్​ సౌత్​ఇండస్ట్రీపై ప్రశంసలు కురిపించింది. దక్షిణాది సినిమాల్లో నటించాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టింది. తాజాగా మణిరత్నం రూపొందించిన పొన్నియిన్‌ సెల్వన్​ను వీక్షించిన ఆమె.. చిత్రంపై తన అభిప్రాయాన్ని తెలిపింది. సినిమా అద్భుతంగా ఉందన్న ఈ అమ్మడు.. మంచి కథ, బలమైన పాత్రలు ఉంటే దక్షిణాది చిత్రాల్లో నటించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పింది.

"నాకు సౌత్‌ఇండియన్‌ సినిమాలు చేయాలని ఉంది. దక్షిణ భారతదేశంలో చాలా మంది గొప్ప దర్శకులు ఉన్నారు. దానికి ఉదాహరణ ఇటీవల విడుదలైన పొన్నియిన్‌ సెల్వన్‌1. ఎంత అద్భుతమైన చిత్రం అది. అందులోని ప్రతి సన్నివేశాన్ని మణిరత్నం ఎంతో గొప్పగా తీశారు. ఆ సినిమా సంగీతం కూడ ఎంత బాగుందో. దర్శకుడు ఇంత పెద్ద స్థాయిలో సినిమా తీసి తన సత్తా నిరూపించుకున్నారు" అని పేర్కొంది. ప్రస్తుతం కత్రినా కైఫ్‌ హారర్ కామెడీ 'ఫోన్‌ భూత్‌' సినిమాతో పలకరించనుంది. ఇందులో ఆమె దెయ్యం పాత్రలో నటించింది. సిద్ధాంత్‌ చతుర్వేది, ఇషాన్‌ కట్టర్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్‌4న థియేటర్లలోకి రానుంది. ఇక ఆమె విజయ్​ సేతుపతితో కలిసి మెరీ క్రిస్మస్​ చిత్రంలోనూ నటిస్తోంది.

ఇదీ చూడండి: కోలుకున్న సల్మాన్.. ఆ వేడుకలో సందడి.. ఫ్యాన్స్ సంబరాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.