టాలీవుడ్ డీసెంట్ హీరోగా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగ చైతన్య గురించి తెలిసిందే. సినిమాలు, ప్రమోషన్లు, కెరీర్ చూసుకోవడం తప్ప ఎలాంటి వివాదాల జోలికి వెళ్లరు. కాంట్రవర్సీ విషయాలకు దూరంగా ఉంటారు. ఇటీవల లాల్ సింగ్ చద్ధా, థ్యాంక్యూ మూవీస్ రిజల్ట్‌తో కాస్త డల్ అయినా.. వరుస సినిమాల షూటింగ్లలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. అందులో ఒకటి వెంకట్ ప్రభుతో చేస్తున్నారు.
ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలోని మేలుకోతే గుడి ప్రాంతంలో జరుగుతోంది. ఆ చారిత్రక దేవాలయంలోనూ పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఆ గుడి పరిసర ప్రాంతంలో ఓ బార్ సెట్‌ను వేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అక్కడి స్థానికులు అలా సెట్ వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారట. అలా ఈ క్రమంలోనే చిత్ర యూనిట్‌తో వాగ్వివాదానికి దిగినట్లు తెలుస్తోంది. కాగా, నాగచైతన్య ప్రస్తుతం వెంకట్ ప్రభు సినిమాతో పాటు దూత అనే వెబ్‌సిరీస్ కూడా చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'పుష్ప 2' కేశవ లుక్ లీక్.. విలన్‌గా మారనున్నాడా?