ETV Bharat / entertainment

ఎయిర్​పోర్ట్​లో కరీనా​కు చేదు అనుభవం.. సెల్ఫీ కోసం ఒక్కసారిగా భుజంపై చేయి.. - కరీనా కపూర్​ సినిమాలు

ముంబయి ఎయిర్​పోర్ట్​లో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్​కు చేదు అనుభవం ఎదురైంది. అభిమానులు ఆమెను చుట్టుముట్టి ఇబ్బంది పెట్టారు. ఒక అభిమాని సెల్ఫీ కోసం ఆమె భుజానికి అడ్డంగా చేయి వేయబోయాడు. దీంతో కరీనా ఒక్కసారిగా భయపడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

kareena kapoor
kareena kapoor
author img

By

Published : Oct 5, 2022, 10:24 AM IST

బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ గతంలో ఎప్పుడూ లేని విధంగా వింత అనుభవాన్ని ఎదుర్కొంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన కొడుకు జహంగీర్ అలీఖాన్‌తో కలిసి ముంబయి విమానాశ్రయంలో కనిపించింది. ఈ సందర్భంగా ఆమెతో ఫోటోలు తీసుకునేందుకు అభిమానులు చుట్టుముట్టారు. కొంతమంది తనతో సెల్పీలు తీసుకున్నారు.

కొద్దిసేపు అభిమానులతో గడిపిన కరీనా.. తర్వాత వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ, కొందరు ఇంకా సెల్పీలు తీసుకునే ప్రయత్నం చేశారు. తన చేతిని పట్టుకుని అక్కడే ఉండాలని కోరే ప్రయత్నం చేశారు. సెల్ఫీ కోసం ఒక అభిమాని ఆమె భుజానికి అడ్డంగా చేయి వేయబోయాడు. వెంటనే ఆమె వ్యక్తిగత సిబ్బంది వారించాడు. ఈ ఘటనతో కరీనా భయపడింది. వెంటనే భద్రతా సిబ్బంది కరీనాను ఎయిర్​పోర్టు లోపలికి తీసుకెళ్లారు.

దీనిపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. "ఇది సరైన పద్దతి కాదు, అభిమానులు ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి" అంటూ పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు. "ఆమె నిజంగా భయపడింది. ప్లీజ్.. సెన్సిటివ్​గా ఉండాలి. వారు కూడా మనుషులే అని గమనించాలి" అంటూ కామెంట్లు వెల్లువెత్తాయి.

హన్సల్ మెహతా దర్శకత్వంలో కరీనా ఓ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ కోసమే ఆమె లండన్ వెళ్లే సందర్భంలో ఈ ఘటన జరిగింది. ఇటీవల కరీనా.. ఆమిర్ ఖాన్​తో కలిసి 'లాల్ సింగ్ చద్దా'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇవీ చదవండి: దసరా స్పెషల్​.. లెహంగాలో బాలీవుడ్​ భామ అందాలు అదుర్స్​!​

'ఆదిపురుష్​ తీసింది వారి కోసం కాదు!'.. ట్రోల్స్​పై దర్శకుడి కౌంటర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.