ETV Bharat / entertainment

Kantara Part 2 Story : 'కాంతార' ప్రీక్వెల్​ కోసం ఏకంగా ఆ శతాబ్దంలోకి.. కళ్లు చెదిరే రేంజ్​లో బడ్జెట్​! - 4వ శతాబ్దంలోకి కాంతారా 2

Kantara Part 2 Story : గతేడాది కేవలం రూ.15 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కి ఎవరూ ఊహించని విధంగా రూ.400కోట్లకు పైగా కలెక్షన్లను అందుకున్న కాంతార సినిమా.. ప్రస్తుతం ప్రీక్వెల్​ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈ సినిమా బడ్జెట్​ గురించి తాజాగా కళ్లు చెదిరే వార్త బయటకు వచ్చింది. ఇంకా ఈ సినిమా బ్యాక్​డ్రాప్​ కూడా ఏ కాలంలో నడుస్తుందో కూడా వివరాలు తెలిశాయి. ఆ సంగతులు..

kantara part 2 story : కాంతారా ప్రీక్వెల్​ కోసం ఏకంగా ఆ శతాబ్దంలోకి.. కళ్లు చెదిరే రేంజ్​లో బడ్జెట్​.. ఎన్ని వందల కోట్లంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2023, 1:12 PM IST

Updated : Sep 26, 2023, 1:46 PM IST

Kantara Part 2 Story : గతేడాది సౌత్ ఇండస్ట్రీలో కొత్త ఉత్సాహాన్ని నింపిన చిత్రం కాంతార. ప్రకృతి - మానవాళికి మధ్య ఉండాల్సిన సంబంధాలను తెలియజేసేలా సినిమాను తీశారు. కన్నడలో చిన్న చిత్రంగా రిలీజై ఆ తర్వాత భారీ రేంజ్​లో ఊహించని విజయాన్ని అందుకుంది. వివిధ భాషల్లోకి కూడా డబ్బింగై అక్కడా ఊహించని విధంగా కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రం లాంగ్ రన్​ టైమ్​లో వరల్డ్​ వైడ్​గా రూ.400కోట్లు పైగానే వసూలు చేసింది.

ఈ చిత్ర తొలి భాగాన్ని.. స్వీయ దర్శకత్వంలో నటించి సినిమాను తెరకెక్కించారు రిషభ్ శెట్టి. ఇప్పుడు కాంతారా 2ను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ప్రీక్వెల్​గా ఇది రూపొందుతోంది. ప్రస్తుతం స్క్రిప్ట్​ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని తెలిసింది. త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారట. షూటింగ్​కు రెడీ అవ్వబోతుందని తెలుస్తోంది. అయితే ఈ చిత్రం కేవలం రూ.15 కోట్ల బడ్జెట్​లోనే రూపొందించారు. కథ మొత్తం ఓ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్​లో సింపుల్​గా తీయడంతో పెద్దగా బడ్జెట్ కాలేదు. అయితే కాంతారా 2 ప్రీక్వెల్​ మాత్రం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారంట. కాంతార సినిమాలో చూసిన కథకు ముందు ఏం జరిగింది అనేది కాంతారా2లో చూపించబోతున్నారు.

Kantara 2 Budget : దీన్ని చాలా గ్రాండియర్​గా సిల్వర్ స్క్రీన్​పై ఆవిష్కరించేందుకు రిషబ్ శెట్టి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ ప్రీక్వెల్ కోసం ఏకంగా రూ.125 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టబోతున్నారని మరోసారి వార్తలు తెరపైకి వచ్చాయి. 4వ సెంచరీలో కథ నడుస్తుందని తాజాగా వార్తలు వస్తున్నాయి. రిషభ్​ శెట్టి కూడా గట్టిగానే రెమ్యునరేషన్ అధికంగా తీసుకుంటారని తెలుస్తోంది. కాస్టింగ్ కూడా భారీగానే ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇతర భాషల నటులను కూడా తీసుకుంటున్నారట. సినిమాకి గ్రాండ్ లుక్ తీసుకురావడంతో పాటు అన్ని భాషల్లో ఒకే సారి విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విఎఫ్ఎక్స్​కు ఎక్కువ స్కోప్ ఉంటుందని అంటున్నారు. అందుకే ఈ సినిమా బడ్జెట్ రేంజ్ కూడా పెరిగినట్లు ఇండస్ట్రీ వర్గాలలో టాక్​ వినిపిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కాంతారా మైండ్​ బ్లాక్​ కలెక్షన్స్​ యాక్టర్స్​ రెమ్యునరేషన్​ ఎంత తీసుకున్నారంటే

అభిమాని.. అర్ధాంగైంది.. 'కాంతారా' హీరో ప్రేమ కథ భలే ఉందిగా!

Last Updated : Sep 26, 2023, 1:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.