ETV Bharat / entertainment

KGF ఫైట్​ మాస్టర్లతో కమల్ మూవీ - ఆయన​ కోసం డైరెక్షన్​లోకి ఎంట్రీ - కమల్​ హాసన్ అన్బరివ్ కాంబినేషన్

Kamal 237 Movie Directors : వరుస సినిమాలతో సందడి చేస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ తాజాగా మరో ప్రాజెక్టుకు సైన్ చేశారు. తన సొంత బ్యానర్​పై నిర్మిస్తున్న ఈ సినిమాతో ఓ కొత్త డైరెక్టర్లను పరిచయం చేస్తున్నారు. ఇంతకీ వారెవరంటే ?

Kamal 237 Movie Directors
Kamal 237 Movie Directors
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2024, 6:50 AM IST

Updated : Jan 13, 2024, 12:55 PM IST

Kamal 237 Movie Directors : లోక నాయకుడు, కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నారు. 'కల్కి 2898 ఏడీ', 'ధగ్​ లైఫ్'​ అనే చిత్రాల షూటింగుల్లోనూ ఆయన సందడి చేస్తున్నారు. ఏడు పదుల వయసులోనూ ఎంతో విలక్షణంగా నటిస్తూ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. ఆయన నటించిన 'విక్రమ్​' ఎంతటి సూపర్​హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఆయన్ను మరిన్ని యాక్షన్​ సినిమాల్లో చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మరో ప్రాజెక్టుకు సైన్ చేశారు.

'కమల్​ 237'గా తెరకెక్కనున్న ఈ మూవీ ప్రస్తుతం పట్టాలెక్కేందుకు సన్నాహాలు జరుగుతోంది. అయితే ఈ చిత్రంతో కోలీవుడ్ కవల యాక్షన్‌ కొరియోగ్రాఫర్లు అన్బరివ్‌ (అన్బుమణి, అరివుమణి) డైరెక్టర్లుగా మారుతున్నారు. ఈ విషయాన్ని కమల్‌ హాసన్‌ స్వయంగా తన అభిమానుల కోసం తాజాగా ట్విట్టర్​ వేదికగా పంచుకున్నారు.

"ఇద్దరు ప్రతిభావంతులు వారి కొత్త అవతారంగా నా 237వ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. మాస్టర్స్‌ అన్బరివ్‌లకు మా రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌కి తిరిగి స్వాగతం పలుకుతున్నాం" అంటూ ఎక్స్‌ ద్వారా ఆయన వారికి వెల్​కమ్​ చెప్పారు. మరోవైపు ఈ సినిమాను కమల్‌హాసన్‌, ఆర్‌.మహేంద్రన్‌ తమ రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మిస్తున్నారు.

ఇక అన్బరివ్​ కెరీర్​ విషయానికి వస్తే ఇటు కోలీవుడ్​తో పాటు అటు బాలీవుడ్​లోనూ ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలకు ఈ కవల సోదరులు స్టంట్ మాస్టర్లుగా పనిచేశారు. 'కేజీఎఫ్‌' 'లియో', 'దసరా' లాంటి సూపర్ హిట్ సినిమాల్లో పనిచేశారు. ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ ', 'గేమ్‌ ఛేంజర్‌', 'ఇండియన్‌ 2', వంటి సినిమాల పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే కమల్​కు ఇటీవలే బ్లాక్ బస్టర్ ఇచ్చిన 'విక్రమ్' సినిమాకు కూడా ఈ ఇద్దరే స్టంట్స్ డిజైన్ చేశారు. ఆ సమయంలోనే వీరు కమల్​కు స్టోరీ వినిపించడం, అది ఆయనకు నచ్చడం వల్ల తానే స్వయంగా తన బ్యానర్​పై తెరకెక్కించేందుకు ఓకే చెప్పినట్లు సమచారం.

'ఇండియన్-2' ఇంట్రో రిలీజ్​, 'భారతీయుడుకు చావే లేదు' అంటున్న కమల్

'భారతీయుడు- 2' షూటింగ్ కంప్లీట్- శంకర్ నెక్ట్స్ టార్గెట్ 'గేమ్ ఛేంజర్'!

Last Updated : Jan 13, 2024, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.