ETV Bharat / entertainment

రష్మి రెమ్యునరేషన్​పై హైపర్​ ఆది కామెంట్స్​.. ఆమె అంత తీసుకుంటుందా? - జబర్దస్త్​ లేటెస్ట్ ప్రోమో

యాంకర్​ రష్మి రెమ్యునరేషన్​పై హైపర్​ ఆది కామెంట్స్​ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ రష్మి ఎంత పేమెంట్​ తీసుకుంటుందంటే?

hyper adi comments on rashmi remuneration
రష్మి రెమ్యునరేషన్​పై హైపర్​ ఆది కామెంట్స్​
author img

By

Published : Oct 14, 2022, 11:01 AM IST

తెలుగునాట యాంకర్​గా బుల్లితెరపై రాణిస్తూనే మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెరపై మెరుస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది రష్మి. అయితే తాజాగా ఆమె రెమ్యునరేషన్​ గురించి ఓపెన్ కామెంట్స్​ చేశాడు జబర్దస్త్​ కమెడియన్​ హైపర్​ ఆది. ఆ సంగుతులు..

తాజాగా జబర్దస్త్​ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో కంటెస్టెంట్​లంతా రెండు టీమ్​లుగా విడిపోయి ఒకరిపై మరొకరు సెటైర్లు వేసుకుంటూ సందడి చేశారు. బుల్లెట్​ భాస్కర్​, ఇమ్మాన్యుయెల్​, రాకింగ్ రాకేశ్​ ఓ గ్యాంగ్​గా మారి క్రికెట్​ బ్యాట్స్​తో ఎంట్రీ ఇచ్చారు. 'మా ఎక్స్​ట్రా జబర్దస్త్​లో ఇద్దరు అబ్బాయిలను ఇక్కడి ఇద్దరు అమ్మాయిలు వలలో వేసుకున్నారు. వారిని వదిలేయండి' అంటూ ఇమ్మాన్యుయెల్​ కామెడీ వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే రెండో టీమ్​ ఆది, రాకెట్ రాఘవ హాకీ స్టిక్స్​తో వచ్చి ఆపోజిట్​ గ్యాంగ్​పై పంచ్​ డైలాగ్​లు వేస్తూ కితకితలు పెట్టించారు.

ఈ క్రమంలోనే బుల్లెట్ భాస్కర్​ కల్పించుకుని.. 'ఇంత అవమానం జరిగాక ఇక్కడ ఎందుకు రష్మి.. పద వెళ్దాం.. నీ పేమెంట్​ నేను ఇంటికి పంపిస్తా' అని అనగా.. అతడికి హైపర్​ ఆది.. అదిరిపోయే కౌంటర్​ వేశాడు. రష్మికి రెమ్యునరేషన్​ ఇవ్వాలంటే.. 'నువ్వు వరుసగా 100 పెద్దమనిషి ఫంక్షన్స్​ చేయాలి' అంటూ పంచ్​ వేశాడు. దీంతో షో అంతా నవ్వులతో నిండిపోయింది. అనంతరం రాకెట్ రాఘవ చేసిన లేడీ గెటప్ స్కిట్​, నూకరాజు మహారాజుల స్కిట్ నవ్వులు పూయించే విధంగా ఉంది. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్​లో దూసుకుపోతుంది. పూర్తి ఎపిసోడ్​ అక్టోబర్ 20న ప్రసారం కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: పుష్ప సినిమా గురించి నేనలా అనలేదు: డైరెక్టర్​ తేజ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.