ETV Bharat / entertainment

రెండేళ్లు టార్గెట్​.. 'జబర్దస్త్​'లో ఆయన అడిగిన ఆ ఒక్క ప్రశ్న.. లైఫ్​ ఛేంజ్​! - జబర్దస్త్​ అశోక్​ స్క్రిప్ట్స్​

Jabardast Ashok: జబర్దస్త్​లోకి తాను ఎంట్రీ ఎలా ఇచ్చాడో తెలిపాడు కమెడియన్​ అశోక్​. ఈ ఎంటర్​టైన్​మెంట్​ రంగంలోకి రావడానికి ఎవరు ప్రోత్సహించారు? నాగబాబు, రోజా ఎలా అండగా నిలిచారు? తన లక్ష్యం ఏంటి? సహా పలు సంగతులను తెలిపాడు. ఆ విశేషాలివీ..

jabardast ashok
జబర్దస్త్ అశోక్​
author img

By

Published : Jun 16, 2022, 9:14 AM IST

జబర్దస్త్ అశోక్​

Jabardast Ashok: గోదావరి యాసలో తనదైన స్టైల్​లో కామెడీని పండిస్తూ బుల్లిప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అశోక్​. కేవలం రెండేళ్ల డెడ్​లైన్​ పెట్టుకుని.. పట్టుదలతో అనుకున్న సమయంలో అవకాశం సంపాదించి అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. ఈ సందర్భంగా ఈటీవీ భారత్​కు ఇచ్చిన స్పెషల్​ ఇంటర్వ్యూలో తన కెరీర్​, గోల్స్​ మొదలైన విషయాలను పంచుకున్నాడు. ఆ వివరాలు ఏంటో అతని మాటల్లోనే తెలుసుకుందాం.

"జబర్దస్త్​లో నా ప్రయాణం 2017 మార్చి 2న ప్రారంభమైంది. అప్పుడే నా తొలి స్కిట్​ టెలికాస్ట్​ అయింది. నాకు ఎలాంటి సపోర్ట్​ లేదు.. డబ్బులు కూడా లేదు. మా ఉర్లో తెలిసిన ఓ బంధువు ద్వారా రాకెట్​ రాఘవ పరిచయం అయ్యారు. అలా నేను జబర్దస్త్​లోకి ఎంట్రీ ఇచ్చాను. చిన్నప్పటి నుంచే సినిమాల పట్ల ఆసక్తి ఉండేది. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలంలోని పెద్దపట్నం మా ఊరు. కబడ్డీ కబడ్డీ, పందెం వంటి సినిమాల షూటింగ్​లు అక్కడే జరిగాయి. ఆ షూటింగ్స్​ చూడటం వల్ల నాకు ఆసక్తి కలిగింది. మా తాతగారు వాళ్లు చిన్న చిన్న నాటకాలు వేసేవారట. సినిమాల పట్ల మక్కువ కలగడానికి అదొక కారణమై ఉండొచ్చు."

-అశోక్​

రెండేళ్లే డెడ్​లైన్​: సినిమాల్లో అవకాశం కోసం రెండేళ్లు టార్గెట్​ పెట్టుకున్నానని చెప్పుకొచ్చాడు అశోక్. అనుకున్నట్టుగానే లక్కీగా అనుకున్న సమయంలోనే రాఘవ టీమ్​లో చేసే అవకాశం వచ్చిందని తెలిపాడు. "మొదట ఒక ఏడాది పాటు బాగా కష్టపడ్డాను. ఆర్​పీ అన్న టీమ్​లో కొన్నాళ్లు చేశా.. ఆ తర్వాత ఓ నాలుగు నెలలు జీ తెలుగులోకి కామెడీ కిలాడీలు అనే షోలో చేశాను. ఆ తర్వత రాకెట్​ రాఘవ ప్రోత్సాహం.. రోజా, నాగబాబుగారు అండగా ఉండటం వల్ల జబర్దస్త్​లో సక్సెస్​ అయ్యాను. ప్రస్తుతం నాకు గుర్తింపు బాగానే ఉంది" అని అశోక్​ చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో ఈ గుర్తింపు మరింత పెరగాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.

వాళ్ల సపోర్ట్​తోనే: తల్లిదండ్రుల అండతోనే నిలదొక్కుకోగలిగానని.. ఏడాదిన్నర పాటు వాళ్ల ఇచ్చే డబ్బులతోనే అవకాశాల కోసం ప్రయత్నించానని అశోక్​ చెప్పాడు. "మా నాన్నగారు ఇంతకుముందు ఓ బిల్డింగ్​ కంపెనీలో చేసేవారు. ప్రస్తుతం ఓ జ్యూస్​షాప్​ నడుపుతున్నారు. మా అమ్మ అట్టలు తయారుచేసే కంపెనీలో పనిచేస్తారు. మా సిస్టర్​, బావగారు కూడా నాకు మంచి సపోర్ట్​ ఇచ్చారు. ఈ సక్సెస్​ చూసి నాకన్నా మా ఇంట్లో వాళ్లే బాగా హ్యాపీగా ఉన్నారు. ఇంక నాకు వేరే ప్రమోషన్స్​ అక్కర్లేదు. ఎవరు కనిపించినా నా గురించి చెప్పుకుంటూ సంతోష పడిపోతున్నారు. వాళ్లు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇంకా చేయాలని ప్రయత్నించాను. అలా మొదట 'జాంబీరెడ్డి' సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత అనసూయ చేసిన 'థాంక్యూ బ్రదర్'​తో పాటు మన ఊరి పాండవులు చేశాను. ప్రస్తుతం నిఖిల్​ హీరోగా నటిస్తున్న '18 పేజీస్'​, వైష్ణవ్​ తేజ నటిస్తున్న 'రంగరంగవైభవంగ'లో చేస్తున్నాను. జబర్దస్త్​ చేస్తూనే ఖాళీగా ఉన్న రోజుల్లో సినిమాలు చేసుకుంటున్నాను. ఇది నాకు అన్నం పెట్టిన షో అందుకే దీనిని వదలకూడదు అని నిర్ణయించుకున్నాను." అని అశోక్​ తన సినీ ప్రయాణం గురించి చెప్పుకొచ్చాడు.

"ఓ స్కిట్​లో నేను కీబోర్డ్​ ప్లేయర్​గా చేశాను. అది బాగా హిట్​ అయింది. స్కిట్​ అయ్యాక నాగబాబుగారు మీది ఏ ఊరు?.. కీబోర్డ్​ బాగా వాయించావ్​? ఎక్కడ నేర్చుకున్నావ్​ అని అడిగి ప్రశంసించారు. ఆ క్షణాన్ని తల్చుకుంటే నాకు ఇప్పటికీ ఆనందంగా ఉంటుంది. ఆ స్కిట్​ తర్వాత నుంచి నాగబాబుగారు నన్ను బాగా ప్రోత్సహించారు. అనంతరం రోజాగారు కూడా నన్ను గుర్తించి సపోర్ట్​ చేశారు. రాకెట్​ రాఘవ కూడా నాకు అండగా నిలిచారు. బయటకు వెళ్లినప్పుడు నన్ను గుర్తుపట్టి కొంతమంది ఫోటోలు దిగుతున్నారు. అది చాలా సంతోషంగా ఉంటుంది."

-అశోక్

అదే నా కల: ఓ కారు, డబుల్​ బెడ్రూం ఇల్లు కొనుక్కోవాలన్నది నా కల. ప్రస్తుతానికి వీలైనన్ని ఎక్కువ సినిమాల్లో చేస్తూ మంచి ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం. జబర్దస్త్​ గురించి చెప్పాలంటే.. కిరాక్​ ఆర్పీ అన్న ఇదివరకు చెప్పిన ఓ మాట చెప్తాను. 'పూర్వజన్మలో కూడా ఇదే టాలెంట్​తో ఇప్పుడున్న ఆర్టిస్టులను దేవుడు పుట్టించాడంట. కానీ వారి ప్రతిభ చూపించేందుకు వారికి వేదిక దొరక్క మరుగున పడిపోయారు. ఇప్పుడు దేవుడు వీళ్లందరికీ అదే టాలెంట్​తో పుట్టించి జబర్దస్త్​ అనే వేదిక అందించాడు.' అని ఆర్పీ చెప్తుండేవాడు. ఇది వాస్తవం.. ఎందుకంటే జబర్దస్త్​ ఎంతోమందికి అవకాశాలు ఇచ్చి వారిని ఉన్నతస్థానాలకు చేర్చింది. ఈ సందర్భంగా మల్లెమాల ప్రొడక్షన్​కు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.

ఇదీ చూడండి: 'జబర్దస్త్ విషయంలో ఆ తప్పు చేశా.. నా రెమ్యునరేషన్ తెలియగానే వారంతా షాక్!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.