ETV Bharat / entertainment

Salman Khan : సల్మాన్‌ ఖాన్‌ ఫేవరెట్​ క్రికెటర్​ ఎవరో తెలుసా? - సల్మాన్​ ఖాన్​ ఫేవరెట్​ క్రికెటర్​

బాలీవుడ్​ స్టార్ హీరో సల్మాన్​ ఖాన్​.. తన ఫేవరెట్​ క్రికెటర్​ ఎవరో చెప్పేశారు. ఆ ప్లేయర్​ ఎవరంటే?

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Apr 13, 2023, 6:55 PM IST

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ తన అప్‌కమింగ్‌ మూవీ 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా తన ఫేవరెట్‌ క్రికెటర్‌ పేరును రివీల్‌ చేశారు. స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానెల్‌లో ప్రసారమయ్యే 'క్రికెట్‌ లైవ్‌' షోలో సల్మాన్‌ తాను అభిమానించే క్రికెటర్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ అని తెలిపారు.

సరదాగా సాగే ఈ ప్రోగ్రాంలో సల్లూ భాయ్‌.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు సంబంధించిన స్పూర్తిదాయకమైన కథలను పిల్లలకు నేర్పించనున్నారు. అలాగే తన తదుపరి సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ విషయాలను షేర్‌ చేసుకోనున్నారు. ఈ షో వీకెండ్​లో మధ్యాహ్నం 2:30 గంటలకు స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

ఈ షోలో సల్మాన్‌.. ధోనీతో పాటు విరాట్‌ కోహ్లీ, హార్ధిక్‌ పాండ్య, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్యాన్స్‌ గురించి ప్రస్తావించారు. కోహ్లీ నుంచి కృషి, పట్టుదల.. హార్ధిక్‌ నుంచి కలలను సాకారం చేసుకోవడం.. సీఎస్‌కే ఫ్యాన్స్‌ నుంచి ప్రేమను పంచుకోవడం లాంటి లక్షణాలను అలవర్చుకోవాలని పిల్లలను బోధిస్తారు. ఈ విషయాలన్నీ తన తదుపరి సినిమాలో ప్రతిబింబిస్తాయని సల్లూ భాయ్​.. పిల్లలకు వివరిస్తారు. నార్త్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తిని (ధోనీ) చెన్నై అభిమానులు ఏరకంగా ఆదరిస్తున్నారో అన్న విషయాన్ని హైలైట్‌ చేశారు. ఈ ప్రోమోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

సల్మాన్‌ సౌత్‌లో తన చిత్ర ప్రమోషన్‌పై ఎక్కువగా దృష్టి సారించారని.. అందులో భాగంగానే ధోనీని, చెన్నై అభిమానులను హైలైట్‌ చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. కొందరేమో సల్మాన్‌కు ధోనీపై ప్రేమ నిజంగా ఉందేమోనని అంటున్నారు. మొత్తానికి బాలీవుడ్‌ క్రేజీ హీరో, వరల్డ్స్‌ మోస్ట్‌ లవబుల్‌ క్రికెటర్‌ పేరు చెప్పడాన్ని క్రికెట్‌ అభిమానులు ఆస్వాదిస్తున్నారు.

ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో రెండు వరుస విజయాలు సాధించి జోష్‌ మీద ఉన్న చెన్నై సూపర్​ కింగ్స్ జట్టు బుధవారం (ఏప్రిల్‌ 12) రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలై హ్యాట్రిక్‌ విక్టరీలు సాధించే అవకాశాన్ని కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో ధోనీ, జడేజా అద్భుతమైన పోరాడినప్పటికీ.. తమ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.