Indian Actors Multiple Roles : భారతీయ సినిమాల్లో నటీనటులు డ్యుయల్ రోల్స్ చేయడం ఈరోజుల్లో సాధారణమైంది. ఒక్కో సినిమాలో పాత్ర డిమాండ్ మేరకు కొందకు నటులు త్రిపుల్ రోల్స్‌లో కూడా నటిస్తున్నారు. 1974లో అప్పటి నటుడు సంజయ్ కుమార్ 'నయా దిన్ నయా రాత్' అనే సినిమాలో తొమ్మిది పాత్రల్లో నటించి దేశంలో సంచలనం సృష్టించాడు. 2008లో తమిళ స్టార్ హీరో కమల్ హసన్ 'దశావతారం' సినిమాలో పది పాత్రల్లో నటించగానే ఔరా అనిపించారు. మరి ఓ నటుడు ఒకే సినిమాలో.. పది కాదు, పదిహేను కాదు ఏకంగా 45 పాత్రల్లో నటించి గిన్నీస్ రికార్డులకెక్కాడు. మరి ఆ నటుడు ఎవరు? అది ఏ సినిమా అంటే?
Johnson Geroge 45 Roles : 2018 మార్చ్‌లో విడుదలైన 'ఆరను జన్' (Aaranu Njan) అనే మలయాళ సినిమాలో జాన్సన్ జార్జ్ అనే నటుడు 45 వేర్వేరు పాత్రల్లో నటించి చరిత్ర సృష్టించారు. సినిమా విడుదలైన ఆరు నెలల తర్వాత.. సెప్టెంబర్ 18న ఆయన ఘనతను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. ఇక ఈ సినిమాలో ఆయన నటించిన వాటిలో మహాత్మ గాంధీ, జీసస్, లియోనార్డో డా విన్సీ పాత్రలు ముఖ్యమైనవి.
మలయాళ ప్రముఖ దర్శకుడు ఆర్ పీ ఉన్నికృష్ణన్ ఈ సినిమాను తెరకెక్కించారు. జయచంద్రన్, మహమ్మద్ నిలంబుర్ ఈ సినిమాలో ప్రాధాన పాత్రల్లో నటించారు. అయితే గంట 47 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో.. జాన్సన్ జార్జ్ గాంధీ, ఏపీజే అబ్దుల్ కలామ్, జీసస్ వంటి 45 విభిన్నమైన పాత్రల్లో నటించారు.
డ్యుయల్ అంతకంటే ఎక్కువ రోల్స్‌లో నటించిన భారత నటులు..
1964లో తమిళ్లో నవరాత్రి అనే సినిమాలో శివాజీ గణేశన్ తొమ్మిది పాత్రల్లో నటించారు. ఇదే సినిమాను 1974లో హిందీలో 'నయా దిన్ నయా రాత్' గా రీమేక్ చేశారు. 2000 వ సంవత్సరంలో 'హద్ కర్దీ అప్నే' సినిమాలో నటుడు గోవిందా.. ఆరు పాత్రల్లో నటించారు.