ETV Bharat / entertainment

Hi Nanna Teaser : డిఫరెంట్ లవ్​ కాన్సెప్ట్​తో 'హాయ్ నాన్నా'.. టీజర్ వచ్చేసింది.. సినిమా ఎప్పుడంటే? - Hi Nanna cast and crew

Hi Nanna Teaser : నేచురల్ స్టార్ కొత్త చిత్రం హాయ్ నాన్న. ఈ సినిమాలో నానికి జోడీగా సీతారామం ఫేమ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఆదివారం చిత్రబృందం సినిమా టీజర్​ను విడుదల చేసింది.

Hi Nanna Teaser
Hi Nanna Teaser
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 15, 2023, 11:31 AM IST

Updated : Oct 15, 2023, 1:06 PM IST

Hi Nanna Teaser : నేచురల్ స్టార్ నాని-సీతారామం ఫేమ్​ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం 'హాయ్ నాన్నా'. దర్శకుడు శౌర్యువ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతోనే శౌర్యువ్ డైరెక్టర్​గా పరిచయం అవుతున్నాడు. ఇక నిర్మాతలు విజయేందర్ రెడ్డి, వెంకట మోహన్ సంయుక్తంగా.. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్​పై రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్​ను మూవీ యూనిట్ హైదరాబాద్​లో ఆదివారం విడుదల చేసింది.

ఫీల్​గుడ్ లవ్​స్టోరీ.. ఈ సినిమాలో హీరో నాని తండ్రి పాత్రలో కనిపించనున్నారు. మూవీ స్టోరీలో తండ్రీ, కుమార్తె మధ్య అనుబంధంతో పాటు, డీసెంట్ లవ్​ స్టోరీ యాడ్ చేశారు. పెళ్లికి ముందు హీరోతో లవ్​లో పడిన అమ్మాయి పాత్రలో మృణాల్ ఒదిగిపోయారు. ఇద్దరి మధ్య ఫీల్​గుడ్​ లవ్​స్టోరీతో పాటు కెమీస్ట్రీ కూడా బాగుందంటూ నెటిజన్లు అంటున్నారు. ఇక టీజర్ రిలీజైన రెండు గంటల్లోనే నాలుగు లక్షలకుపైగా వ్యూస్​తో దూసుకుపోతోంది.

ఇక టీజర్​లో​ చూపించిన పాప, నాని సొంత కూతురా.. కాదా?, మరి పెళ్లి ఫిక్స్​ అయిన మృణాల్​తో నాని లవ్​ స్టోరీ ఎక్కడిదాకా వెళ్లింది? ఇవన్నీ తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే! కాగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన.. 'సమయమా', 'గాజు బొమ్మ' పాటలు.. ఆడియోన్స్​ను ఆకట్టుకుంటున్నాయి.

'హాయ్ నాన్న' విషయానికొస్తే.. ప్రముఖ కథానాయిక శ్రుతిహసన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి అబ్దుల్ వహబ్ సంగీతం అందించారు. ప్రవీణ్ అంథోని ఎడిటర్​గా వ్యవహరించగా.. శీతల్ శర్మ క్యాస్ట్యూమ్ డిజైనర్​గా పని చేశారు. సినిమా డిసెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్​గా రిలీజ్ కానుంది.

'హాయ్ నాన్న' విడుదల ప్రీపోన్!.. అయితే ఈ సినిమాను ముందుగా డిసెంబర్ 22న రిలీజ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేసింది. కానీ, అదే రోజున రెబల్ స్టార్ ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన 'సలార్' విడుదల కానున్నందున.. ఈ చిత్రం రిలీజ్​ను ముందుకు తీసుకువచ్చారని సినీవర్గాల్లో టాక్.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'హార్ట్ బ్రేక్' అంటూ ఇన్​స్టాలో నాని పోస్ట్​.. ఆ సినిమాకు నేషనల్ అవార్డు రానందుకు ఫీలయ్యాడా!

Nani Rajinikanth : రజనీ-అమితాబ్​ సినిమా.. నాని నో చెప్పడానికి అసలు కారణమిదా?.. తెలిసిపోయిందిగా!

Last Updated : Oct 15, 2023, 1:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.