Hero Nani Success Formula : నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం 'హాయ్ నాన్న' సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. డిసెంబర్ 7న రిలీజైన ఈ సినిమా మంచి టాక్ దక్కించుకొని, మినిమమ్ ఆక్యుపెన్సీతో థియేటర్లలో రన్ అవుతోంది. ఈ ఏడాది 'దసరా'తో హిట్ కొట్టిన నాని, తాజాగా 'హాయ్ నాన్న' సినిమాతో మరోసారి సక్సెస్ అందుకున్నారు. దీంతో ఒకే సంవత్సరంలో రెండు హిట్లు తన ఖాతాలో వేసుకున్నారు నాని. అయితే నాని సినిమా డిసప్పాయింట్ చేయదనే ఆలోచనతో, ప్రేక్షకులు కూడా థియేటర్లకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నాని సక్సెస్ మంత్ర ఏమిటా అని నెట్టింట్లో చర్చలు నడుస్తున్నాయి.
అయితే వరుస సినిమాలు చేస్తూనే, ఎప్పుడూ ఒకేలా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న కథలు ఎంపిక చేసుకుంటారు నాని. ఇదివరకు ఆయన నటించిన 'జెర్సీ', 'గ్యాంగ్ లీడర్', 'అంటే సుందరానికి', 'శ్యామ్ సింగ రాయ్', 'దసరా' సినిమాలు అలాంటివే. పైగా కొత్త డైరెక్టర్లకు నాని ఎక్కువగా ఛాన్స్ ఇస్తుంటారు. అయితే కొంతమంది కొత్తవాళ్లతో రిస్క్ ఎక్కువ అనుకుంటారు. కానీ, నాని అలాకాకుండా కొత్తవారితోనే హిట్లు అందుకున్నారు. ఒక రకంగా నాని విజయ రహస్యం ఇదే కావచ్చని నెటిజన్లు అనుకుంటున్నారు.
Nani Saripodhaa Sanivaaram : హీరో నాని ప్రస్తుతం 'సరిపోదా శనివారం' సినిమా చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసింది మూవీటీమ్. వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో ఇదివరకు 'అంటే సుందరానికి' సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను కూడా వివేక్, డిఫరెంట్ జానర్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. సీనియర్ నటుడు ఎస్ జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాతోపాటు నాని మరో రెండు ప్రాజెక్ట్లు లైన్లో పెట్టారంట. ఈ లెక్కన 2024లో కూడా నాని నుంచి రెండు లేదా మూడు సినిమాలు ఎక్స్పెక్ట్ చెయవచ్చు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'కావాలని చేయలేదు - మేమంతా మంచి ఫ్రెండ్స్ - ఇబ్బందిపడి ఉంటే సారీ'! : నాని
'హాయ్ నాన్న' కోసం సోలో ప్రమోషన్స్ - నాని ఆ సక్సెస్ ఫార్ములాను వాడుతున్నారా ?