ETV Bharat / entertainment

Hero Nani Crush Name : అప్పుడే తొలిసారి ప్రేమలో పడ్డారంట.. నాని ఫస్ట్​ క్రష్​ ఈమెనే! - హాయ్​ నాన్న మూవీ ప్రమోషన్స్

Hero Nani Crush Name : నేచురల్​ స్టార్ నాని ప్రస్తుతం హాయ్​ నాన్న సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు. డిశంబర్​లో ఈ సినిమా రిలీజవ్వనున్న నేపథ్యంలో తాజాగా సినిమా ప్రమోషన్లను కూడా ముమ్మరం చేసింది మూవీ టీమ్​. ఇందులో భాగంగా తాజాగా రేడియో జాకీలతో చిట్​చాట్​ చేశారు నాని. అయితే అందులో ఆయన క్రష్​ నేమ్​ రివీల్​ చేశారు. ఇంతకీ ఆ అమ్మయి ఎవరంటే ?

Hero Nani Crush Name
Hero Nani Crush Name
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2023, 4:00 PM IST

Hero Nani Crush Name : 'దసరా' సినిమా సక్సెస్​ను ఆస్వాదించిన నేచురల్‌ స్టార్‌ నాని ప్రస్తుతం 'హాయ్​ నాన్న' అనే సినిమాలో లీడ్​ రోల్​లో నటిస్తున్నారు. డిసెంబర్​లో విడుదలవ్వనున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్​ దశలో ఉంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్​ కుడా వేగవంతం చేశారు. ఇందులో భాగంగా తాజాగా రేడియో జాకీలతో కలిసి ఓ చిట్‌చాట్‌ నిర్వహించారు. అందులో తాను మొదటిసారి ప్రేమలో ఎప్పుడు పడ్డారో చెప్పారు. అలాగే ప్రస్తుతం తన క్రష్‌ ఎవరో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.

"ప్రేమ అంటే ఏంటో ఇప్పుడు తెలిసింది. కానీ, నేను ప్రేమలో పడింది మాత్రం మూడో తరగతిలోనే. అప్పుడు ఫ్యాన్సీ డ్రెస్‌ పోటీల్లో సోనీ అనే అమ్మాయి మంచి గౌను వేసుకుని వచ్చింది.అప్పుడు నేనేమో ఆకులు చుట్టుకుని నిలబడ్డాను. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి కనిపిస్తే.. ప్రస్తుతం నేనూ మంచి డ్రెస్‌ వేసుకున్నా కాబట్టి వెళ్లి తనని పలకరిస్తాను" అంటూ సరదాగా చెప్పారు. అయితే కియారా ఖన్నా (హాయ్‌ నాన్న చైల్డ్‌ ఆర్టిస్టు) తన ప్రస్తుత క్రష్​ అని చెప్పుకొచ్చారు.

"ఒక రోజు కియారా ఖన్నా చక్కగా రెడీ అయి సెట్‌కు వచ్చింది. భలే ముచ్చటగా అనిపించింది. నేను కనుక తన వయసులో ఉంటే తనపై మనసు పారేసుకునే వాడిని. కాబట్టి ప్రస్తుతం నా క్రష్‌ ఆ పాపనే" అని నాని అన్నారు.

Hi Nanna Movie Cast : ఇక 'హాయ్‌ నాన్న' సినిమా విషయానికొస్తే.. శౌర్యువ్‌ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్‌ ఈ సినిమాలో నాని సరసన నటిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఇదే పేరుతో రానుండగా.. హిందీలో మాత్రం 'హాయ్‌ పాపా' అనే పేరుతో రిలీజ్​ కానుంది. తండ్రీ కూతుళ్ల అనుబంధాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. వినూత్నమైన కథాంశంతో పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ డిసెంబరు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇటీవల విడుదల చేసిన 'సమయమా' అనే పాట మ్యూజిక్​ లవర్స్​ను తెగ ఆకట్టుకుంటోంది.

Nani 30 Movie Title : 'నాని 30' మూవీ టైటిల్​ అదేనా?

'హాయ్ నాన్న'.. మనసును హత్తుకుంటున్న నాని-మృణాల్ గ్లింప్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.