ETV Bharat / entertainment

Hero Ajith House : హీరో అజిత్​ ఇల్లు కూల్చివేత!.. ఏం జరిగిందంటే? - తమిళ నటుడు అజిత్​ ఇళ్లు

Hero Ajith House :తమిళ స్టార్​ హీరో అజిత్​ ఇంటి గోడను మున్సిపాలిటీ వాళ్లు ధ్వంసం చేశారు. చెన్నైలోని ఇంజంబాక్కంలో ఆయన నివాసమంటున్న ఇంటితో పాటు అదే కాలనీలో ఉన్న పలు ఇళ్ల గోడలను కూల్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే ?

Hero Ajith House
Hero Ajith House
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 22, 2023, 7:35 PM IST

Hero Ajith House : తమిళ స్టార్​ హీరో అజిత్ కుమార్​​ ఇంటి గోడను మున్సిపాలిటీ సిబ్బంది ధ్వంసం చేశారు. ఇటీవలే తమిళనాడు చెన్నైలోని ఇంజంబాక్కంలో ఆయన నివాసమంటున్న ఇంటితో పాటు అదే కాలనీలో ఉన్న పలు ఇళ్ల గోడలను కూల్చారు. రోడ్డు విస్తరణతో పాటు డ్రైనేజీ పనులు జరుగుతున్న కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. అయితే 2017లోనే అజిత్​ తన నివాసానికి మరమ్మతులు చేయించారు. అందులో భాగంగా ఆ ఇంటికి మెరుగులు అధునాతన హంగులతో తీర్చిదిద్దించిన అజిత్​.. తన తనయుడి కోసం స్పెషల్​ రూమ్స్​ను ఏర్పాటు చేయించారు. అంతే కాకుండా డ్యాన్స్​ ప్రాక్టీస్​ కోసం కూడా గదిని కేటాంచారు.

Ajith Upcoming Movies : 'తెగింపు' సినిమాతో మాసివ్​ సక్సెస్​ అందుకున్న అజిత్.. ఆ తర్వాత సినిమాలకు కొంత విరామం ఇచ్చి బైక్​ రైడింగ్​లో బిజీ అయిపోయారు. తాజాగా తన నెక్స్ట్​ మూవీ 'విడాముయార్చి' షూటింగ్​లో బిజీ అయిపోయారు. 'తాడం' ఫేమ్ మగిజ్ తిరుమేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం అజర్‌బైజాన్‌లో ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

Ak 62 Movie : ఏకే 62 ప్రాజెక్ట్‌గా రానున్న ఈ చిత్రానికి తమిళ మ్యూజిక్ డైరెక్టర్​ అనిరుధ్‌ రవిచందర్ సంగీతం అందిస్తుండ‌గా.. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు చేపడుతోంది. మరోవైపు ఈ చిత్రంలో అజిత్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నట్లు టాక్‌ నడుస్తోంది. వీరిలో త్రిష, తమన్నా పేర్లు వినిపిస్తుండగా.. ఈ విషయంపై ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ రాలేదు.

Ajit Adhik Ravichandran Movie : మరోవైపు 'మార్క్ ఆంటోని'తో బ్లాక్ బస్టర్ సాధించిన ప్రముఖ దర్శకుడు అధిక్ రవిచంద్రన్.. అజిత్ 63వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్​ పనులు మొదలయ్యాయని.. ప్రస్తుతం అజిత్, అధిక్ రవిచంద్రన్ కథా చర్చల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. ఎల్రెడ్ కుమార్ నేతృత్వంలోని ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపడుతోందట. ఈ సినిమా గురుంచి కూడా ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

హీరో అజిత్​ అలా చేస్తారా.. ఆ సీక్రెట్ చెప్పేసిన త్రిష.. తెలిస్తే షాక్​ అవ్వాల్సిందే!

ఈ హీరోలు నో ఇంటర్వ్యూ పాలసీ.. మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.