ETV Bharat / entertainment

ఓటీటీలోకి వెన్నులో వణుకుపుట్టించే థ్రిల్లర్‌ మూవీ.. మీరు చూడగలరా?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2023, 5:09 PM IST

వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా వెన్నులో వణుకుపుట్టించే రేంజ్​లో ఓ థ్రిల్లర్‌ సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమా ఓటీటీ వేదికగా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. మీరు చూడగలరా ఆ సినిమా?

ఓటీటీలో వెన్నులో వణుకుపుట్టించే థ్రిల్లర్‌ మూవీ.. మీరు చూడగలరా?

Hebah Patel The Great Indian Suicide : రామ్‌ కార్తిక్‌, హెబ్బాపటేల్‌ కీలక పాత్రల్లో నటించిన మిస్టరీ థ్రిల్లర్‌ 'ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌'. విప్లవ్‌ కోనేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబరు 6వ తేదీన రిలీజ్ కానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్‌ అవ్వనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్​ మీడియాలో ఆహా ట్వీట్‌ కూడా చేసింది. ప్రచార చిత్రం చూస్తుంటే, సినిమా ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ అని అర్థమవుతోంది. పోస్టర్​లో తలలేని హెబ్బా పటేల్​ను చూపించి కాస్త భయపెట్టించారు. కళ్లను కప్పేసిన మూఢనమ్మకం.. నమ్మకంతో రాసుకున్న మరణశాసనం అని రాసుకొచ్చారు. ఈ సినిమా కల్ట్​ క్లాసిక్ సూసైడ్ స్టోరీ అని చెప్పారు.

ఈ సినిమా నేపథ్యం ఏంటంటే?.. మ‌ద‌న‌ప‌ల్లి పట్టణంలో జ‌రిగిన వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా 'ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్' తెర‌కెక్కించారు. ఓ కుటుంబం ఆత్మ‌హ‌త్య‌ చేసుకోవాలనుకుంటుంది. అస‌లు సూసైడ్ చేసుకోవడానికి వెనక వాళ్ల ఉద్దేశం ఏంటి? మళ్లీ పుట్ట‌డ‌మేనా? అసలేందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎమోష‌న‌ల్ డ్రామా, మ‌న‌సును తాకే థ్రిల్స్, అనూహ్య‌మైన రొమాన్స్... సినిమాలో అన్నీ ఉండేలా తీర్చిదిద్దారు. చిత్రంలో హెబ్బా పటేల్​తో పాటు నటులు న‌రేష్ వీకే, ప‌విత్రా లోకేష్‌ కూడా భార్య భర్తలుగా కనిపించనున్నారు.

ఈ చిత్రానికి అజయ్ వి నాగ్, అనంత్ నాగ్ కావూరి- ఛాయాగ్రహణం, ధర్మేంద్ర కాకరాల -కూర్పు, డాక్టర్ జివాగో - సాహిత్యం, జావేద్ మాస్టర్ - నృత్యాలు, సీహెచ్ రామకృష్ణ - పోరాటాలు, ఉపేందర్ రెడ్డి - కళ, శ్రీ చరణ్ పాకాల - సంగీతం అందించారు. దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్ ప్లే, మాటలు విప్లవ్ కోనేటి అందించారు. కాగా, హెబ్బా ప‌టేల్ నటించిన 'ఓదెల రైల్వే స్టేష‌న్' కూడా ఆహాలోనే రిలీజైంది. ఇప్పుడు 'ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్' కూడా ఆహాలో రిలీజ్​కు రెడీ అయింది. న‌రేశ్​ - ప‌విత్రా లోకేష్ జంటగా నటించిన 'మళ్ళీ పెళ్లి' కూడా ఆహాలోనే వచ్చింది.

Kantara Part 2 Story : 'కాంతార' ప్రీక్వెల్​ కోసం ఏకంగా ఆ శతాబ్దంలోకి.. కళ్లు చెదిరే రేంజ్​లో బడ్జెట్​!

Parineeti Chopra Raghav Chadha Wedding : వెడ్డింగ్​ డ్రెస్​లో కొత్త జంట ఫన్నీ డ్యాన్స్​.. వీడియో భలే ఉందిగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.