Hanuman Reached Break Even: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ ఏడాది బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన తొలి సినిమాగా 'హను-మాన్' రికార్డు కొట్టింది. జనవరి 12న పాన్ఇండియా లెవెల్లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. సూపర్ హిట్ టాక్ అందుకోవడం వల్ల ఓపెనింగ్ డే కంటే తర్వాత రెండు రోజులు హనుమాన్ ఎక్కువ ఆక్యుపెన్సీతో రన్ అవుతోంది. ఫలితంగా రిలీజైన మూడు రోజుల్లోనే 'హను-మాన్' బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకొని, ప్రస్తుతం లాభాల్లోకి ఎంటర్ అయినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మూడు రోజుల్లో ఇప్పటివరకు సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.30కోట్ల మార్క్ క్రాస్ చేసినట్లు తెలుస్తోంది.
Hanuman Overseas Collection: దేశవ్యాప్తంగానే కాకుండా 'హను-మాన్' ఓవర్సీలోనూ రికార్డులు నెలకొల్పుతోంది. ఓవర్సీస్లో ఇప్పటికే ఈ సినిమా 2 మిలియన్ డాలర్లు వసూల్ చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఇటు భారత్‌లో మూడు రోజుల్లోనే పది లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు ప్రముఖ టికెట్ బుకింగ్ సంస్థ 'బుక్ మై షో' తెలిపింది.
-
First Hit of Indian Movies in 2k24#HanuMan rampage continues 🔥🔥🔥🔥🔥
— Hi Harsha 👋❤️🔥 (@TrendJersey) January 14, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Break Even done in 3Days 🔥🔥pic.twitter.com/ezxd8ywuUN
">First Hit of Indian Movies in 2k24#HanuMan rampage continues 🔥🔥🔥🔥🔥
— Hi Harsha 👋❤️🔥 (@TrendJersey) January 14, 2024
Break Even done in 3Days 🔥🔥pic.twitter.com/ezxd8ywuUNFirst Hit of Indian Movies in 2k24#HanuMan rampage continues 🔥🔥🔥🔥🔥
— Hi Harsha 👋❤️🔥 (@TrendJersey) January 14, 2024
Break Even done in 3Days 🔥🔥pic.twitter.com/ezxd8ywuUN
Hanuman Bookings: ఇవాళ కూడా బుకింగ్స్‌లో హనుమాన్ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. ఆదివారం (జనవరి 14) సాయంత్రానికి హైదరాబాద్‌లో 145 షోస్‌కు గాను 145 సోల్డ్ అవుట్ (Sold Out) అయ్యాయి. ఇక సోమవారం (జనవరి 15) నాటి బుకింగ్స్‌లో హైదరాబాద్‌లో 321 షోస్‌కు గాను ఇప్పటికే 310 షోస్ సోల్ట్ అవుట్ అయినట్లు తెలిసింది.
-
#HanuMan World Wide Break Even Done in Just 3 Days
— Milagro Movies (@MilagroMovies) January 14, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
All Entered into Profit Zone
">#HanuMan World Wide Break Even Done in Just 3 Days
— Milagro Movies (@MilagroMovies) January 14, 2024
All Entered into Profit Zone#HanuMan World Wide Break Even Done in Just 3 Days
— Milagro Movies (@MilagroMovies) January 14, 2024
All Entered into Profit Zone
నైజాంలో పెరిగనున్న స్క్రీన్స్: హను-మాన్కు విశేష స్పందన రావడం వల్ల రేపట్నుంచి నైజాంలో స్క్రీన్స్ పెరగనున్నాయి. అలాగే ఆయా ఏరియాల్లో అదనంగా మార్నింగ్ షోస్ (Morning Shows) కూడా ప్రదర్శించనున్నట్లు తెలిసింది.
Hanuman Cast: ఈ సినిమాలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ కీ రోల్స్‌లో నటించగా, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్, వినయ్ రాయ్, సత్య, దీపక్ శెట్టి ఆయా పాత్రలు పోషించారు. ఇక ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాను నిరంజన్ రెడ్డి నిర్మించారు.
'హనుమాన్' కలెక్షన్స్ - రెండో రోజు భారీగా జంప్ - ఏకంగా ఎన్ని కోట్లంటే?
తీసినోడు నా కొడుకు - 'హనుమాన్' దర్శకుడి తండ్రి వీడియో వైరల్