Guntur Kaaram Mahesh Babu Sankranthi Movies : సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ సంక్రాంతికి థియేటర్స్‌లో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. రికార్డ్ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. విడుదలకు ముందే బుకింగ్స్‌లో రికార్డులు క్రియేట్ చేస్తూ భారీ హైప్‌ను క్రియేట్ చేస్తోంది. ఈ సందర్భంగా మహేశ్ తన కెరీర్లో ఎన్ని సార్లు సంక్రాంతి బరిలో దిగారు? ఎన్నిసార్లు హిట్స్ అందుకున్నారు? ఓ సారి చూద్దాం.
టక్కరి దొంగ : కౌ బాయ్ పాత్రలో మహేశ్ బాబు చేసిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ టక్కరి దొంగ. భారీ అంచనాలతో 2002 జనవరి 12 సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ అంతగా ఆడలేదు.
ఒక్కడు : మహేశ్ మళ్ళీ సంక్రాంతికే తన సినిమాను తీసుకు వచ్చారు. 2003 జనవరి 15 సంక్రాంతి బరిలో 'ఒక్కడు'గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఈ చిత్రం మహేశ్ కెరీర్ ఓ మైల్ స్టోన్‌గా నిలిచింది.
బిజినెస్‌మెన్ : ఒక్కడు తర్వాత మళ్లీ దాదాపు తొమ్మిదేళ్ల వరకు సంక్రాంతి వైపు చూడలేదు మహేశ్. 2012 జనవరి 14 బిజినెస్‌మెన్‌తో విజయం సాధించారు. పోకిరి తర్వాత పూరి జగన్నాథ్, మహేశ్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం థియేటర్ వద్ద కాసుల వర్షం కురిసింది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు : 2013 జనవరి 11న వెంకటేశ్‌తో కలిసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో వచ్చి సూపర్ హిట్‌ను దక్కించుకున్నారు మహేశ్.
1 నేనొక్కడినే : టక్కరి దొంగ తర్వాత మహేశ్‌కు సంక్రాంతి బరిలో మరోసారి దెబ్బ తగిలింది ఈ చిత్రంతోనే. 2014 జనవరి 10న రిలీజైన ఈ చిత్రం ఫ్లాప్ టాక్‌ను దక్కించుకుంది.
సరిలేరు నీకెవ్వరూ : చివరిగా 2020 జనవరి 11న సరిలేరు నీకెవ్వరూ చిత్రంతో సంక్రాంతి బరిలో నిలిచారు మహేశ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌ను అందుకుంది.
అలా మహేశ్ బాబు తన కెరీర్లో ఇప్పటివరకు మొత్తం ఆరుసార్లు సంక్రాంతి బరిలో పోటీ చేశారు నాలుగు సార్లు విజయాన్ని సాధించారు. ఇప్పుడు గుంటూరు కారంతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. ఈ సినిమా థియేటర్స్ లెక్క, ప్రీ బుకింగ్స్ చూస్తుంటే - సినిమా హిట్ అవుతుందని అంతా ఆశిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ - శ్రీలీల కట్టుకున్న చీర ధర అన్ని లక్షలా?
మహేశ్ గత 5 చిత్రాల వసూళ్లు - 'గుంటూరు కారం' బ్రేక్ చేస్తుందా?