తమిళ స్టార్‌హీరో అజిత్‌కుమార్, నయనతారల కలయికలో ఓ సినిమా తెరకెక్కుతోంది. విఘ్నేశ్ శివన్ దర్శకుడు. ఈ సినిమాను ప్రకటించిన దగ్గరి నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా గురించి ఓ వార్త జోరుగా ప్రచారమవుతోంది. ఈ మూవీలో ప్రముఖ దర్శకుడు గౌతమ్‌మేనన్ విలన్ పాత్రలో నటించనున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. వీటికి చెక్ పెడుతూ గౌతమ్‌మేనన్ తాజాగా సమాధానం చెప్పారు.
"విఘ్నేశ్ నాకు చాలా మంచి ఫ్రెండ్. అయితే ఈ సినిమాలోని పాత్ర గురించి నాకు ఇంకా ఎటువంటి సమాచారం లేదు. నా దృష్టికి ఏ వార్త రాలేదు. ఒకవేళ విలన్ పాత్రకోసం నన్ను సంప్రదిస్తే నేను కచ్చితంగా ఒప్పుకొంటాను. ఎందుకంటే నాకు ప్రతినాయకుడిగా నటించడం ఇష్టం" అన్నారు. అలాగే విజయ్‌తో నటించాలని ఉందంటూ తన కోరికను బయటపెట్టాడు ఈ డైరెక్టర్. "చాలా కాలంగా విజయ్‌తో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. అతని వైపు నుంచి ఏమైనా అవకాశాలు వస్తే నేను నటిస్తాను" అంటూ విజయ్‌తో నటించాలనే తన కోరికను చెప్పాడు గౌతమ్ మేనన్.
ఇదీ చూడండి: నటుడికి జీవితఖైదు.. తల్లిని చంపి ఆపై ప్రధానిని చంపేందుకు కుట్ర