First Indian Actress Own Rolls Roys Before Mukesh Ambani : ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ కార్లలో రోల్స్ రాయిస్ కారు మొదటి స్థానంలో ఉంటుంది. సంపన్నులు ఈ కారును స్టేటస్ సింబల్‌గా చూస్తారు. అయితే.. ఆ కారులోని సౌకర్యాలకన్నా.. బ్రాండ్‌కే వాల్యూ ఎక్కువ. ఎందుకంటే.. రోల్స్ రాయిస్ కారును ఎవరికి పడితే వారికి అమ్మరు. నిజాయతీగా, కష్టపడి సంపాదించిన వారికీ మాత్రమే విక్రయిస్తుంది కంపెనీ. అటువంటి కారును.. ఓ హీరోయిన్ దశాబ్దాల క్రితమే కొనుగోలు చేశారు. భారత దేశంలో అత్యంత సంపన్నుడైన ముఖేశ్ అంబానీ కంటే ముందే.. సొంతం చేసుకోవడం విశేషం. ఈ కారును కొనుగోలు చేసిన మొట్టమొదటి భారతీయ నటిగా ఆమె రికార్డ్ సృష్టించారు. ఇంతకీ.. ఆమె ఎవరో తెలుసా? అలనాటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ "నదిరా".
నదిరా 1932 ఇరాక్‌లో జన్మించారు. ఈమె పూర్తి పేరు ఫ్లోరెన్స్ ఎజెకిల్ నదిరా. ఆమె కుటుంబం బాగ్దాద్ నుంచి ముంబయికి వలస వచ్చింది. అలా.. నదిరా చిన్నతనంలోనే హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. పది సంవత్సరాల వయస్సులో హిందీ చిత్రం మౌజ్‌లో (1943) మొదటిసారిగా నటించింది. ఈ చిత్రంలో నటించినందుకు నదిరా పారితోషికంగా రూ.1,200 తీసుకున్నారు.
హీరోయిన్‌గా హవా..
సహాయక పాత్రల్లో..
60వ దశకం తర్వాత.. ఆమెకు సినిమా ఛాన్సులు తగ్గిపోయాయి. దీంతో.. క్రమంగా వెండితెరకు దూరమయ్యారు. 1980 తర్వాత సహాయక పాత్రల ద్వారా రీఎంట్రీ ఇచ్చారు. నదిరా నటించిన చివరి సినిమా "జోష్". 1975లో నటించిన "జూలీ" చిత్రానికి గానూ.. నదిరా బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ కేటగిరీలో ఫిలింఫేర్ అవార్డ్‌ను అందుకున్నారు. 73 సంవత్సరాల వయస్సులో 2006 ఫిబ్రవరిలో నదిరా మరణించారు.
అతని వద్ద 600 రోల్స్ రాయిస్, 300 ఫెరారీ, మొత్తం 7000 కార్లు! అంబానీ కాదు, టాటా కాదు! ఎవరు?
రోల్స్ రాయిస్ లగ్జరీ ఎలక్ట్రిక్ కారు ధర తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం