Dunki Movie OTT Rights : 'పఠాన్', 'జవాన్' సినిమాలతో ఇప్పటికే రెండు భారీ బ్లాక్ బస్టర్లను తన ఖాతాలో వేసుకున్న బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ 'డంకీ'తో మరో సాలిడ్ హిట్‌ను అందుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు పాజిటివ్ టాక్ అందుకుని బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. రాజ్‌కుమార్ హిరానీ మార్క్ డైరెక్షన్ మూవీ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని కనబరుస్తున్నారు.
మరోవైపు ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఇందులో భాగంగా ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమాస్ రూ. 155 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిందని సమాచారం. దీంతో షారుక్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా సంక్రాంతికి లేదా రిపబ్లిక్ డే కానుకగా త్వరలోనే స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అంటే సినిమా విడుదలైన దాదాపు 25 రోజుల్లోనే ఇది ఓటీటీలో సందడి చేయనుందట. అయితే ఈ విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు.
కథేంటంటే?
పంజాబ్‌లోని ఓ చిన్న పల్లెటూరికి చెందినవాళ్లు మన్ను (తాప్సి), సుఖి (విక్కీ కౌశల్), బుగ్గు (విక్రమ్ కొచ్చర్), బల్లి (అనిల్ గ్రోవర్) ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య. వాటి నుంచి గట్టెక్కడానికి ఇంగ్లండ్ వెళ్లడమే మార్గం. కానీ, వీసాలకి తగినంత చదువు, డబ్బు వీరి వద్ద ఉండదు. ఈ క్రమంలోనే ఆ ఊరికి పఠాన్ కోట్ నుంచి జవాన్ హర్ దయాల్ సింగ్ థిల్లాన్ అలియాస్ హార్డీ సింగ్ (షారుక్ ఖాన్) వస్తాడు. ఆ నలుగురి పరిస్థితులను అర్థం చేసుకుని సాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇందు కోసం రకరకాల ప్రణాళికలు రచిస్తాడు. వీసా ఇంటర్వ్యూల్లో గట్టెక్కేందుకు గులాటి (బొమన్ ఇరానీ) దగ్గర అందరూ కలిసి ఇంగ్లీష్ నేర్చుకుంటారు. కానీ, ఆ ఐదుగురిలో ఒకరికి మాత్రమే వీసా వస్తుంది. మిగిలినవారికి దారులు మూసుకుపోతాయి. అయినా సరే, అక్రమ మార్గాన (డంకీ ట్రావెల్) ఇంగ్లాండ్‌లోకి ప్రవేశించాలని నిర్ణయించుకుంటారు. ఆ క్రమంలో వాళ్లకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్ని దేశాల సరిహద్దుల్ని దాటి వెళ్లగలిగారా? ఇంతకీ వాళ్ల సమస్యలేమిటి? తిరిగి మాతృదేశానికి వచ్చారా? తదితర విషయాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.
'డంకీ'లో షారుక్ అందుకోసమే నటించారట - ఈ సినిమా గురించి ఈ విశేషాలు తెలుసా?
'డంకీ' రివ్యూ- బాద్షా నటన అద్భుతం- షారుక్ ఖాతాలో రూ.1000 కోట్ల సినిమా!