గత కొంతకాలంగా భారత చలన చిత్రసీమలో ఎన్నో మార్పులు వచ్చాయి. భాషతో సంబంధం లేకుండా చిత్రాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతూ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఒకప్పుడు సినిమాను.. ఎన్ని రోజులు ఆడిందన్న విషయాన్ని ఎక్కువగా పరిగణలోకి తీసుకునేవారు. కానీ ఇప్పుడు బాక్సాఫీస్ కలెక్షన్లను చూస్తున్నారు. ఎన్ని వందల కోట్లు కొల్లగొట్టిందని లెక్కలేస్తున్నారు. అయితే కలెక్షన్ల విషయంలో ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్‌దే ఎప్పుడూపై చేయి ఉండేది. వంద కోట్ల నుంచి వెయ్యి కోట్ల సినిమా అంటే.. అది హిందీ చిత్రమే అయి ఉండేది. అమీర్ ఖాన్ 'దంగల్' అయితే ఏకంగా రూ. 2000 కోట్లను వసూలు చేసి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కానీ ఇప్పుడు అంతా మారింది.
ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చేశాయి. ఒక్కప్పుడు ఇక్కడ తమిళ, తెలుగు చిత్రసీమల మధ్యే పోటీ ఉండేది. అయితే 'బాహుబలి' సిరీస్, 'ఆర్ఆర్ఆర్'తో టాలీవుడ్ ఖ్యాతి అటు ఇండియాతో పాటు వరల్డ్‌వైడ్‌గా పెరిగిపోయింది. ఈ రెండు చిత్రాలు వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్‌ను అందుకున్నాయి. ఆ తర్వాత ఎవరికీ అంతగా తెలియని కన్నడ సినీ పరిశ్రమ కూడా 'కేజీయఫ్' సిరీస్, 'కాంతార' వంటి చిత్రాలూ సూపర్ హిట్‌ను అందుకుని.. దేశవ్యాప్తంగా అందరిని తమ ఇండస్ట్రీ వైపుకు చూసేలా చేశాయి. 'కేజీఎఫ్ 2' సుమారు 1148 కోట్లను వసూలు చేసింది. కాంతారా కూడా రూ. 15 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది రూ.500కోట్ల వరకు వసూళ్లను అందుకుంది. అలా తెలుగు, కన్నడ సినిమాలు వెయ్యి కోట్ల క్లబ్‌లోకి చేరాయి. అలా సౌత్ సినిమా దెబ్బకు నార్త్ సినిమా గ్రాఫ్ గత కొద్ది కాలంగా పడింది. కానీ రీసెంట్గా రిలీజైనా షారుక్ పఠాన్‌తో మళ్లీ తిరిగి పుంజుకుంది. అది కూడా రూ. 1000 కోట్ల మార్క్ అందుకుంది. అయితే కోలీవుడ్‌లో మాత్రం ఇంతవరకు వెయ్యి కోట్లు కలెక్షన్లను అందుకున్న సినిమా ఏది ఇంతవరకు రాలేదు.
తమిళంలో ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం రజనీకాంత్ నటించిన '2.0'. బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్ సాధించినప్పటికీ ఈ సినిమా వంద కోట్ల మార్క్‌ను దాటలేకపోయింది. కేవలం 650 కోట్లతో సరిపెట్టుకుంది. అయితే రీసెంట్గా రిలీజైన 'పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1' ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమా సీక్వెల్‌పై కొండంత ఆశలు పెట్టుకున్నారు తమిళ అభిమానులు. ఇప్పటికే పీఎస్ 1ను సినీ ప్రియులు ఎంతగానో ఆదరించగా.. ఇప్పుడు దీని రెండో భాగాన్ని కూడా అంతే ఆదరిస్తారని మేకర్స్ ఆశిస్తున్నారు. మరీ ఈ సినిమాతో అన్న తమిళ ఇండస్ట్రీ రూ.1000 కోట్ల మార్క్‌ను దాటుతుందో లేదో లేక ఆ రికార్డును బ్రేక్ చేసి దూసుకెళ్తుందో చూడాలి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పొన్నియిన్ సెల్వన్ 2' ఈ ఏడాది ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదల కానుంది. చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, శోభిత ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి లాంటి స్టార్స్ ఈ సినిమాలో ప్రధానపాత్రలు పోషిస్తున్నారు.
-
Get ready to experience the magic of #Aaganandhe in all its glory! 20th March. 6 PM. Stay tuned!
— TipsMusicSouth (@tipsmusicsouth) March 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
🎤: @ShakthisreeG
✍🏻: @IananthaSriram#PS2 #PonniyinSelvan #CholasAreBack #ManiRatnam @arrahman @madrastalkies_ @LycaProductions @Tipsofficial @tipsmusicsouth @IMAX @primevideoIN pic.twitter.com/Br63Xj8e7e
">Get ready to experience the magic of #Aaganandhe in all its glory! 20th March. 6 PM. Stay tuned!
— TipsMusicSouth (@tipsmusicsouth) March 17, 2023
🎤: @ShakthisreeG
✍🏻: @IananthaSriram#PS2 #PonniyinSelvan #CholasAreBack #ManiRatnam @arrahman @madrastalkies_ @LycaProductions @Tipsofficial @tipsmusicsouth @IMAX @primevideoIN pic.twitter.com/Br63Xj8e7eGet ready to experience the magic of #Aaganandhe in all its glory! 20th March. 6 PM. Stay tuned!
— TipsMusicSouth (@tipsmusicsouth) March 17, 2023
🎤: @ShakthisreeG
✍🏻: @IananthaSriram#PS2 #PonniyinSelvan #CholasAreBack #ManiRatnam @arrahman @madrastalkies_ @LycaProductions @Tipsofficial @tipsmusicsouth @IMAX @primevideoIN pic.twitter.com/Br63Xj8e7e