ETV Bharat / entertainment

'ఆ సినిమా వల్ల ఐదేళ్లు అప్పులు కట్టాను'.. డైరెక్టర్ ట్వీట్‌కు అవాక్కైన నెటిజన్లు!

చిత్రసీమలో రీరిలీజ్​ల పండుగ జరుగుతున్న వేళ ఓ అభిమాని.. డైరెక్టర్ కృష్ణ వంశీకి సింధూరం సినిమా రీరిలీజ్​ చేయమంటూ కోరాడు. దానికి ఆయన ఇచ్చిన రిప్లై అందరినీ షాక్​ గురి చేసింది. అసలు ఏమైందంటే..

author img

By

Published : Jan 6, 2023, 8:00 AM IST

Director krishna vamsi Sindhooram movie re release
krishna vamsi

ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో రీరిలీజ్‌లు ట్రెండింగ్‌గా మారాయి. ఆయా హీరోల పుట్టినరోజుల్లో పాత సినిమాలను హైక్వాలిటీలో మరోసారి థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఫ్యాన్స్‌ కూడా రీరిలీజ్‌లకు భారీగానే వెళ్తున్నారు. అయితే, ప్రస్తుతం ఓ సినిమా రీరిలీజ్‌కు సంబంధించి ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ పెట్టిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన సింధూరం సినిమాను రీరిలీజ్‌ చేయాలని ఓ నెటిజన్‌ కోరగా.. ఆయన ఇచ్చిన రిప్లైకి అందరూ ఆశ్చర్యపోయారు.

1997లో విడుదలైన 'సింధూరం' సినిమా నేషనల్‌ అవార్డు దక్కించుకున్నప్పటికీ కమర్షియల్‌గా హిట్‌ అవ్వలేదు. రవితేజ, బ్రహ్మాజీ, సంఘవి నటించిన ఈ చిత్రాన్ని బిగ్‌ స్క్రీన్‌పై మళ్లీ చూడాలని కొందరు సినీప్రియులు కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని కృష్ణవంశీని కోరారు. "సర్‌ ఓక్క సారి సింధూరం సినిమాను రీరిలీజ్‌ చేయండి. నాలాంటి వాళ్లు చాలామంది చూడడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మా ఆశ నెరవేర్చాలని కోరుకుంటున్నాం" అని ట్వీట్‌ చేశారు.

కృష్ణవంశీ దీనికి స్పందిస్తూ "అమ్మో.. ఐదు సంవత్సరాలు అప్పులు కట్టానయ్యా, వామ్మో.." అంటూ దండం పెట్టేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అయింది. 'ఇది సాదాసీదా సినిమా కాదు' అని ఒకరంటే.. 'ఇప్పుడు రిలీజ్‌ చేయండి. సూపర్‌ హిట్‌ అవుతుంది' అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ప్రస్తుతం కృష్ణవంశీ 'రంగమార్తాండ' అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్‌, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధానపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం చిరంజీవి చెప్పిన 'నేనొక నటుణ్ని' షాయరీ అందరినీ ఆకట్టుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.