ETV Bharat / entertainment

చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' టైటిల్​ వెనక ఇంత పెద్ద కథ ఉందా? - చిరంజీవి వాల్తేరు వీరయ్య సాంగ్స్

చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'వాల్తేరు వీరయ్య'. శ్రుతిహాసన్‌ కథానాయిక. రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు బాబీ (కె.ఎస్‌.రవీంద్ర) సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ఆ సంతులు..

Chiru Valteru Verayya title and trailer
Chiru Valteru Verayya title and trailer
author img

By

Published : Jan 7, 2023, 6:11 PM IST

చిరంజీవి, రవితేజ కాంబినేషన్ ఎలా ఉండబోతోంది?
బాబీ: ప్రతిసీన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. అలాగే అద్భుతమైన ఎమోషన్స్‌ కూడా ఉంటాయి. సంక్రాంతి పండక్కి రాబోతున్న కలర్‌ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు బ్యూటీఫుల్ ఎమోషన్స్ ఉన్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఇక ఈ సంక్రాంతికి బాక్సాఫీస్‌ వద్ద పోటీ భారీగానే ఉంది. ఇతర నిర్మాతలు అయితే, ఒత్తిడికి గురయ్యేవారేమో. కానీ, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలకు ఒకే నిర్మాతలు కావడంతో రెండు ఫలితాలు బాగుండాలని ఆశిస్తున్నాం.
'వాల్తేరు వీరయ్య' అవకాశం ఎలా వచ్చింది?
బాబీ: చిరంజీవి గారికి ఉన్న లక్షలమంది అభిమానుల్లో నేనూ ఒకడిని. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఆయన సినిమాలో పనిచేయాలని ఉండేది. దాదాపు 20ఏళ్ల తర్వాత ఏకంగా ఆయనను డైరెక్ట్‌చేసే అవకాశం లభించింది. ఒక అభిమానిగా, మాస్ ఆడియన్స్ ఏం కోరుకుంటారో దాన్నే దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేశా. లాక్‌డౌన్‌ కన్నా ముందే చిరంజీవిగారికి ఈ కథ చెప్పా. అయితే, కరోనా తర్వాత అత్యధికమంది ప్రేక్షకులు ఓటీటీకి అలవాటు పడ్డారు. దీంతో చిన్న చిన్న మార్పులు చేసి, రవితేజ పాత్రను తీసుకొచ్చా. ఈ విషయం చిరంజీవిగారికి కూడా చెబితే ఆయన వెంటనే ఓకే అన్నారు. ఇక రవితేజ అతిథి పాత్రలో కనిపిస్తారా? పూర్తి స్థాయిలో కనిపిస్తారా? అన్నది మీరు తెరపై చూడాల్సిందే. ఎందుకంటే ఎన్ని మాస్‌ అంశాలు ఉన్నా, ఇందులో కథే ప్రధానమైంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'వాల్తేరు వీరయ్య' టైటిల్ పెట్టడానికి కారణం?
బాబీ: 'వెంకీ మామ' షూటింగ్ యాగంటిలో జరుగుతున్నపుడు నాజర్ గారు ఒక పుస్తకం ఇచ్చారు. అందులో వీరయ్య అనే పేరు ఆకట్టుకుంది. ఈ టైటిల్‌తో సినిమా చేయాలని అప్పుడే మా టీంకి చెప్పాను. అలాగే చిరంజీవి గారు ఇండస్ట్రీకి రాకముందు బాపట్లలో ఉన్నప్పుడు ఆయన నాన్నగారు ఓ హెడ్ కానిస్టేబుల్ ఐదు వందలు ఇచ్చి ఫొటో షూట్ చేయించారు. ఆ ఫొటోలతోనే మద్రాస్ వచ్చానని చిరంజీవి గారు చెప్పారు. ఆ కానిస్టేబుల్ పేరు కూడా వీరయ్య. ఇది చాలా నోస్టాలిజిక్‌గా అనిపించింది. ఇందులో చిరంజీవి పాత్రకు వీరయ్య పేరు అయితే బాగుంటుందని అనిపించింది. ఇది చిరంజీవి గారికి కూడా నచ్చింది. అలా వాల్తేరు వీరయ్యని లాక్ చేశాం.
ఇందులో 'ముఠామేస్త్రీ', 'గ్యాంగ్‌లీడర్' లాంటి వింటేజ్ లుక్ కనిపిస్తోంది. కథ అనుకున్నపుడే ఇలా డిజైన్ చేశారా ?

బాబీ: 'వాల్తేరు వీరయ్య' పాత్రలో ఆ లిబర్టీ ఉంది. ఆయన లుంగీ కట్టుకోవచ్చు, బీడీ తాగొచ్చు, రౌడీ అల్లుడు స్వాగ్ ఉండొచ్చు. 'గ్యాంగ్ లీడర్'లా గన్ పట్టుకొని వార్‌కి రావచ్చు. ఆ ఫ్రీడమ్ అంతా వీరయ్య క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది తప్పితే బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయలేదు. ఇందులో చిరంజీవి డ్యాన్స్‌తో పాటు ఫన్ టైమింగ్ అదిరిపోతుంది. ఎందుకంటే ఆయన అందులో మాస్టర్‌.

పూనకాలు లోడింగ్ బాగా ట్రెండ్‌ అయినట్లు ఉంది!
బాబీ: అవును! ఇప్పుడు ప్రతి సినిమాకి హ్యాష్‌టాగ్‌లు పెడుతున్నారు. మా సినిమా కొత్తగా ఉండటంతో పాటు, మాస్‌కు బాగా దగ్గరవ్వాలని 'పూనకాలు లోడింగ్‌' అనే ట్యాగ్‌ అనుకున్నాం. మేము అనుకున్నట్లే ఇప్పుడు అందరూ లోడింగ్ అనే మాటని పాజిటివ్ వైబ్‌గా వాడుతున్నారు. ఈ విషయంలో మేము సక్సెస్ అయ్యాం.
తెరపై ఇద్దరు హీరోలని బ్యాలెన్స్ చేస్తున్నపుడు అభిమానుల విషయంలో ఒత్తిడి ఉంటుంది కదా!
బాబీ: ఆ మాట వాస్తవమే. 'వాల్తేరు వీరయ్య'లో నాకున్న సౌలభ్యం ఏమిటంటే చిరంజీవిగారి ఫ్యాన్స్, రవితేజ ఫ్యాన్స్ ఒకటే. చిరును అభిమానించే ఫ్యాన్స్ రవితేజని కూడా ఎంతగానో అభిమానిస్తారు. పూనకాలు లోడింగ్ సాంగ్‌కి వచ్చిన రెస్పాన్స్ దీనికి నిదర్శనం.

'వాల్తేరు వీరయ్య' ఫస్ట్ కాపీ మీరు చూశారు.. ఎలా అనిపించింది?
బాబీ: నేను చూడటం కంటే 153 సినిమాలు చేసిన చిరంజీవి గారు నేను చేసిన సినిమా చూస్తున్నారంటే నాకు నిద్రలేదు. ఆయన జడ్జిమెంట్‌ చాలా పక్కాగా ఉంటుంది. వాల్తేరు వీరయ్య (waltair veerayya) మొత్తం చూసి 'మనం బ్లాక్ బస్టర్ కొడుతున్నాం బాబీ' అన్నారు. ఆ రోజు నేను గర్వంగా ఫీలయ్యాను. ఆయన నన్ను ఓ తమ్ముడిగా దగ్గరకు తీసుకున్న ఆత్మీయత నా జీవితంలో మర్చిపోలేను. ఆ ఫోటోని ఫ్రేమ్ కట్టించుకున్నా.
దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి?
బాబీ: చిరు- దేవిశ్రీ ది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వాల్తేరు వీరయ్య ఆల్బమ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. సినిమా థియేటర్‌కి వచ్చే ముందు మొదట గెలిచేది ఆడియో పరంగానే. అలా మమ్మల్ని గెలిపించిన దేవిశ్రీ ప్రసాద్‌కి కృతజ్ఞతలు. ఇక ఆర్ట్‌ డైరెక్టర్‌ ఏఎస్ ప్రకాష్ అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చారు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్‌తో కలసి పని చేయాలని ఎప్పటినుంచో ఉంది. ఇలాంటి సమయంలో నవీన్ గారు సినిమా చేద్దామని అడిగారు. తర్వాత జర్నీ మొదలైయింది. అద్భుతమైన నిర్మాతలు. సినిమా అంటే ప్యాషన్. సినిమాకి ఏం కావాలో ఎక్కడ రాజీ పడకుండా సమకూరుస్తారు.

'వాల్తేరు వీరయ్య'కి సీక్వెల్ ఉంటుందా ?
బాబీ: ఇప్పటికైతే లేదండీ. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు కోరిక బట్టి ఆ దిశగా ఆలోచిస్తాం. ఇక చిరంజీవి, రవితేజలకు హిందీలో మంచి మార్కెట్ ఉంది. ఈ ఇద్దరు హీరోలు అక్కడి ఆడియన్స్‌కి చాలా ఇష్టం. వాల్తేరు వీరయ్య తెలుగుతో పాటు హిందీలో ఒకేసారి విడుదల చేస్తున్నారు నిర్మాతలు.మంచి కథ దొరికితే కచ్చితంగా పాన్‌ ఇండియా మూవీ చేస్తా!

ఇదీ చూడండి: వారిపై శ్రీముఖి ఫుల్ ఫైర్​ టైమ్​ వస్తే ఆ విషయం గురించి అరిచి మరీ చెబుతుందట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.