ETV Bharat / entertainment

Dilraju Nithin Movie : పవన్ హిట్​ టైటిల్‌తో నితిన్ కొత్త సినిమా షురూ.. 'వకీల్ సాబ్' డైరెక్టర్ సడెన్ ట్విస్ట్! - దిల్​రాజుతో నితిన్ కొత్త సినిమా

Dilraju Nithin Movie : హీరో నితిన్​ తన కొత్త సినిమాను సెట్స్​పైకి తీసుకెళ్లారు. పవర్​ స్టార్ పవన్ కల్యాణ్ సూపర్​ హిట్ మూవీ 'తమ్ముడు' పేరుతో ఈ మూవీ చేస్తున్నారు. వకీల్ సాబ్ డైరెక్టర్​ వేణు శ్రీరామ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

Dilraju Nithin Movie
Dilraju Nithin Movie : పవన్ టైటిల్‌తో నితిన్ కొత్త సినిమా షురూ.. వకీల్ సాబ్ డైరెక్టర్ సడెన్ ట్విస్ట్!
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2023, 10:00 AM IST

Updated : Aug 27, 2023, 11:26 AM IST

Dilraju Nithin Movie : టాలీవుడ్‌ హీరో నితిన్ తన కొత్త సినిమాను అనౌన్స్​ చేశారు. దాన్ని సెట్స్​పైకి తీసుకెళ్లారు. 'వకీల్ సాబ్' ఫేమ్​ దర్శకుడు వేణు శ్రీరామ్‌తో ఈ చిత్రం చేయబోతున్నారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ ఈవెంట్​కు మూవీటీమ్​తో పాటు దర్శకులు వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి సహా మరి కొందరు హాజరయ్యారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్​పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్​​ సూపర్ హిట్​ మూవీ 'తమ్ముడు' టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని హీరో నితిన్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.. 'కొన్ని టైటిల్స్ ఎంతో బాధ్యతను పెంచేలా వస్తాయి. ఈ సినిమా మీ అంచనాలను మించేలా ఉంటుంది. నా కొత్త సినిమా వేణు శ్రీరామ్, దిల్ రాజు గారితోనే' అంటూ రాసుకొచ్చారు.

కాగా, పవన్ కల్యాణ్​కు నితిన్​ వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. కాబట్టి ఇప్పుడు పవన్ టైటిల్​ 'తమ్ముడు'తోనే(nithin pawankalyan) వస్తుండడం వల్ల సినిమాపై అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయని తెలిసింది. త్వరలోనే అన్నీ పూర్తి చేసుకుని రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం అందింది. త్వరలోనే సినిమాలో నటించే నటీనటులు, ఇతర టెక్నీషియన్ల వివరాలను తెలియజేయనున్నారు.

Nithin New Movie Updates : ఇకపోతే 'జయం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నితిన్​.. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకున్నారు. చిన్న వయసులోనే స్టార్ స్టేటస్​ను అందుకున్నారు. అయితే ఆ మధ్యలో వరుస పరాజయాలతో సతమతమైన ఆయన.. ఆ తర్వాత హిట్​ ట్రాక్​ ఎక్కారు. కానీ మళ్లీ కొన్నాళ్లకు వరుసగా డిజాస్టర్లను అందుకోవడం ప్రారంభించారు. 'భీష్మ' తర్వాత ఆ రేంజ్ హిట్ మళ్లీ అందుకోలేదు. ప్రస్తుతం ఆయన చేతిలో వెంకీ కుడుములతో ఓ చిత్రం, వక్కంతం వంశీతో మరో సినిమా ఉన్నాయి. ఇవి సెట్స్​పైన ఉన్నాయి. ఇప్పుడు వీటితో పాటు వేణు శ్రీరామ్​తో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యారు.

20ఏళ్ల వయసు తగ్గనున్న నితిన్‌.. కొత్త సినిమా కోసం భారీ ప్రయోగం.. వర్కౌట్​ అవుతుందా?

డిఫరెంట్​ స్టైల్​లో రష్మిక న్యూ మూవీ అనౌన్స్​మెంట్​​.. మళ్లీ 'భీష్మ' కాంబోనే

Last Updated : Aug 27, 2023, 11:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.