ETV Bharat / entertainment

లెక్చరర్​గా మారిన ధనుష్​.. ఆసక్తిగా 'సార్​' టీజర్​ - ధనుష్​ సార్​ మూవీ రిలీజ్ డేట్​

Dhanush Sir movie teaser: కోలీవుడ్‌ స్టార్ హీరో ధనుష్​ నటిస్తున్న 'సార్​' సినిమా టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ఇందులో ధనుష్‌ లెక్చరర్‌గా కనిపించారు. ఆయన స్మార్ట్‌ లుక్‌, క్లాస్‌ డైలాగ్స్‌ టీజర్‌లో ప్రధానాకర్షణగా నిలిచాయి.

Dhanush sir teaser
ధనుష్ సార్ టీజర్​
author img

By

Published : Jul 28, 2022, 6:57 PM IST

Dhanush Sir movie teaser: కోలీవుడ్‌ ప్రముఖ నటుడు ధనుష్‌ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న చిత్రం 'సార్‌'. వెంకీ అట్లూరి దర్శకుడు. సంయుక్త మేనన్‌ కథానాయిక. నేడు ధనుష్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం తాజాగా టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో ధనుష్‌ లెక్చరర్‌గా కనిపించారు. ఆయన స్మార్ట్‌ లుక్‌, క్లాస్‌ డైలాగ్స్‌ టీజర్‌లో ప్రధానాకర్షణగా నిలిచాయి. విద్యా వ్యవస్థ నేపథ్యంలో యాక్షన్‌- డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది.

కాగా, 'సార్' మూవీపై మంచి బజ్​ క్రియేట్​ అయింది. దానికి తగ్గట్టుగానే ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచుతూ వస్తున్నాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన టీజర్ అద్భుతంగా కట్ చేశారు చిత్ర యూనిట్. ఈ టీజర్‌లోనే సినిమా కథ ఏమిటో మనకు చెప్పేసింది చిత్ర యూనిట్. కార్పొరేట్ విద్యా వ్యవస్థ నిరుపేదలకు చదువును ఎలా దూరం చేస్తుందనే అంశంపై ఈ సినిమా కథ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. "జీరో ఫీజ్ జీరో ఎడ్యుకేషన్.. మోర్ ఫీజ్ మోర్ ఎడ్యుకేషన్.. ఇదేరా ఇప్పుడు ట్రెండ్" అంటూ ప్రస్తుత విద్యా వ్యవస్థ గురించి ఒక్కమాటలో చెప్పేశాడు దర్శకుడు వెంకీ అట్లూరి. ఈ సినిమాను క్లాస్, మాస్ ప్రేక్షకులు మెచ్చేలా అన్ని అంశాలతో తెరకెక్కిస్తోంది సార్ చిత్ర యూనిట్. ఇక 'బాల గంగాధర్ తిలక్' అనే పవర్‌ఫుల్ పేరు హీరోకు ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు పెంచేశాడు ధనుష్. సరికొత్త మేకోవర్‌తో ధనుష్ లుక్ అదిరిపోయింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నాగవంశీ, సౌజన్యలు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక జి. వి. ప్రకాశ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ఛాయాగ్రహణం-యువరాజ్‌, కూర్పు- నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌- అవినాష్‌ కొల్లా అందించారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబరులో విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: రామ్​చరణ్​కు హాలీవుడ్ ఆఫర్​.. 'జేమ్స్​బాండ్'​గా ఛాన్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.