ETV Bharat / entertainment

రాజమౌళి-మహేశ్​ సినిమాలో ఛాన్స్​ కొట్టేసిన దీపికా పదుకొణె! - మహేశ్​ బాబు కొత్త సినిమాలో దీపికా పదుకొణె

దిగ్గజ దర్శకుడు ఎస్​ఎస్​ రాజమౌళి మరో సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ప్రముఖ కథానాయకుడు మహేశ్​ బాబుతో యాక్షన్​ అడ్వెంచర్​ నేపథ్యంలో సాగే కథతో సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం కోసం బాలీవుడ్​ భామ దీపికా పదుకొణెను ఎంపిక చేశారు జక్కన్న.

Rajamoulis next film
Rajamoulis next film
author img

By

Published : Oct 18, 2022, 1:56 PM IST

దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్ఆర్'​ ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ క్రేజీ డైరెక్టర్​ మరో క్రేజీ ప్రాజెక్టు చేస్తున్నారు. సుపర్​ స్టార్​ మహేశ్​ బాబుతో తీస్తున్న ఈ చిత్రం.. ప్రపంచాన్ని చుట్టొచ్చే సాహసికుడి కథ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఈ సినిమాకు కథ ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ అందిస్తున్నారు. భారీ స్థాయిలో నిర్మించే ఈ సినిమాలో మహేశ్​ సరసన ఎవరు నటించనున్నారనే విషయం ఇంకా మేకర్స్​ వెల్లడించలేదు. అయితే తాజాగా బాలీవుడ్ భామ దీపికా పదుకొణె మహేశ్​తో రొమాన్స్ చేసే ఛాన్స్​ కొట్టేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే రాజమౌళి ఏ సినిమా చేసినా.. దాని గురించి ఎక్కువ బయటకు తెలియకుండా వర్కింగ్​ టైటిల్​తోనే బజ్​ క్రియేట్​​ చేస్తారు. ఇప్పుడు కూడా ఈ క్రేజీ ప్రాజెక్టు 'SSMB29' అనే వర్కింగ్​ టైటిల్​తో తెరకెక్కిస్తున్నారు. అడ్వెంచర్​, డ్రామా జోనర్​లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశముంది. ప్రస్తుతం దీపికా.. ప్రభాస్​ హీరోగా 'మహానటి' దర్శకుడు నాగ్​ అశ్విన్ తెరకెక్కిస్తున్న 'ప్రాజెక్ట్​ కే' లో నటిస్తోంది. కొవిడ్​ కారణంగా ఆలస్యం అయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.

ఇవీ చదవండి : గోదావరిఖనిలో వెన్నెల.. ఆ చిత్రంలోంచి బయటకు వచ్చిన రష్మిక.. 'యశోద' విడుదల అప్పుడే

ఆచితూచి అడుగులు.. ఆలస్యమైనా సరే అలాంటి కథతోనే ముందుకు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.