David Warner Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఐపీఎల్ ట్రోఫీని అందించిన ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్‌కు మరో అవమానం జరిగింది. 2021లో కెప్టెన్సీ నుంచి తప్పించి అవమానించిన సన్‌రైజర్స్ మరోసారి అలాంటి పనే చేసింది. ఐపీఎల్ వేలం జరుగుతన్న వేళ వార్నర్‌ను సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ తన సోషల్ మీడియా ఖాతాల్లో బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని స్వయంగా వార్నరే స్క్రీన్ షాట్స్ తీసి మరీ నెట్టింట వెల్లడించాడు. దీన్ని చూసిన క్రికెట్ లవర్స్ సన్‌రైజర్స్ ఫ్రాంచైజీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే ?
ఐపీఎల్ 2024 మిని వేలంలో ఆసీస్ ప్లేయర్లు పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్‌ను సన్‌రైజర్స్ అత్యధిక ధరకు దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆ ఇద్దరు ప్లేయర్లుకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పేందుకు వార్నర్ ప్రయత్నించాడు. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ వార్నర్‌ను సామాజిక మాధ్యమాల్లో బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని వార్నర్ స్క్రీన్ షాట్ తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
'ట్రావిస్ హెడ్ షేర్ చేసిన పోస్ట్‌ను రీ పోస్ట్ చేయాలని ప్రయత్నించాను. కానీ సన్‌రైజర్స్ నన్ను బ్లాక్ చేసింది.' అంటూ డేవిడ్ వార్నర్ పోస్ట్ చేశాడు. దీంతో అభిమానులు అందరూ సన్‌రైజర్స్ ఫ్రాంచైజీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-
SRH have blocked David Warner from Twitter/X and Instagram. pic.twitter.com/ZH3NSQ3yzV
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">SRH have blocked David Warner from Twitter/X and Instagram. pic.twitter.com/ZH3NSQ3yzV
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 19, 2023SRH have blocked David Warner from Twitter/X and Instagram. pic.twitter.com/ZH3NSQ3yzV
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 19, 2023
డేవిడ్ వార్నర్ 2014 ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరాడు. ఆ సీజన్ హైదరాబాద్ తరపు ఆడి స్టార్ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో 2015లో అతడు సన్ రైజర్స్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అంతే కాకుండా ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు (848) చేసిన ఆటగాళ్లలో రెండువ స్థానాన్ని కూడా దక్కించుకున్నాడు. అయితే బాల్ ట్యాంపరింగ్ కుంభకోణం జరిగిన తర్వాత సన్‌రైజర్స్ 2021లో డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించింది. ఆ తర్వాత 2022 మెగా వేలానికి ముందు వార్నర్‌ను రిలీజ్ చేసింది సన్‌రైజర్స్. ఇంక అప్పటి నుంచి డేవిడ్ వార్నర్ దిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు.
అటు ఐపీఎల్- ఇటు బిజినెస్‌లు- కావ్య పాప ఆస్తులెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆల్‌టైమ్ రికార్డ్ ప్రైజ్- వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ రాకతో SRHలో నయా జోష్