ETV Bharat / entertainment

'దసరా' డైరెక్టర్​కు గిఫ్ట్​గా ఖరీదైన BMW కార్​.. - దసరా డైరెక్టర్​కు నిర్మాత కానుక

'దసరా' హిట్​ కావడంతో ఫుల్​ ఖుషీగా ఉన్నారు నిర్మాత సుధాకర్​ చెరుకూరి. సినిమా కలెక్షన్ల పరంగా సంతృప్తిగా ఉన్న ఆయన తాజాగా డైరెక్టర్​ శ్రీకాంత్​ ఓదెలకు ఓ ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారట. అంతేకాకుండా మూవీ కోసం పని చేసిన కొందరికి కూడా విలువైన వస్తువును గిఫ్ట్​గా ఇస్తున్నారట. ఆ వివరాలు..

dasara producer gifted bmw car to director
దసరా డైరెక్టర్​కు నిర్మాత బీఎండబ్ల్యూ గిఫ్ట్​
author img

By

Published : Apr 4, 2023, 12:51 PM IST

Updated : Apr 4, 2023, 1:35 PM IST

కొత్త దర్శకుడు శ్రీకాంత్​ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన మాస్​ ఎంటర్​టైనర్​ సినిమా 'దసరా'. బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్లతో దూసుకుపోతోంది. దీంతో నిర్మాత సుధాకర్​ చెరుకూరి ఎంతో సంతోషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన దర్శకుడికి అభినందనలు తెలుపుతూ.. తన వంతుగా డైరెక్టర్​ శ్రీకాంత్​కు లక్షలు విలువ చేసే కాస్ట్లీ BMW కారును గిఫ్ట్​గా ఇచ్చారట. ఈ కారు​ విలువ సుమారు రూ.80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. అంతేకాకుండా సినిమా కోసం పని చేసిన మరికొంత మంది టెక్నిషియన్స్​, ఆర్టిస్టులకు కూడా ఓ గోల్డ్​ కాయిన్​ కానుకగా ఇస్తున్నారట.

గతనెల 30న థియేటర్లలో గ్రాండ్​గా రిలీజ్​ అయింది 'దసరా'. కేవలం నాలుగు రోజుల్లోనే సుమారు రూ.87 కోట్ల గ్రాస్​ వసుళ్లను రాబట్టింది. రూ.100 కోట్ల మార్క్​కు కేవలం కొద్ది దూరంలోనే ఉండటంతో ప్రొడ్యూసర్​ సుధాకర్​ ఆనందంతో పొంగిపోతున్నారు. ఎందుకంటే గత ఐదు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన సుధాకర్​ చెరుకూరికి ఈ రేంజ్​లో కలెక్షన్స్​ రాలేదు. కానీ ఇప్పుడు 'దసరా' మాత్రం ఘన విజయం సాధించడంతో మంచి లాభాల్లోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే మూవీ సక్సెస్​కు కారణమైన మరికొంత మంది టెక్నిషియన్స్​తో పాటు ఆర్టిస్ట్​లకు కూడా ఒక్కొక్కరికి 10 గ్రాముల గోల్డ్​ కాయిన్​ను ప్రెజెంట్​ చేస్తున్నారట.

ఇక ఈ సినిమాలో నేచురల్​ స్టార్​ నాని పూర్తి మాస్​లుక్​లో ధరణి పాత్రలో మెప్పించారు. హీరోయిన్​ కీర్తి సురేష్​ కూడా వెన్నెల క్యారెక్టర్​లో ఆడియన్స్​కు బాగా కనెక్ట్​ అయ్యారు. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ నటినటులను, డైరెక్టర్​ను మెచ్చుకుంటూ.. సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే వైవిధ్యమైన కథతో మొదటి సినిమాతోనే విజయం అందుకున్న శ్రీకాంత్​ ఓదెలను.. టాలీవుడ్​కు మరో అద్భుతమైన దర్శకుడు దొరికాడంటూ సినీ ప్రియులు అంటున్నారు.

'దసరా'ను మెచ్చుకున్న జక్కన్న!
ఇటు సామాన్యులతో పాటు అటు ప్రముఖులు కూడా దసరాలో నటించిన వారిని అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హీరో నానిపై ప్రశంలు కురిపించారు దర్శక దిగ్గజం రాజమౌళి. ఈ సినిమాతో నాని తన కెరీర్​లోనే అత్యుత్తమమైన నటనను ప్రదర్శించాడని కొనియాడారు జక్కన్న. హీరోయిన్​ కీర్తి సురేశ్​​ కూడా వెన్నెల పాత్ర​లో లీనమై అవలీలగా నటించందంటూ మెచ్చుకున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. వాస్తవ ప్రపంచంలో పాత్రల మధ్య హృదయానికి హత్తుకునే ఓ గొప్ప లవ్ స్టోరీని తెరకెక్కించారంటూ ప్రశంసించారు. మరోవైపు హీరో ప్రభాస్ కూడా దసరా సినిమా బాగుందంటూ మెచ్చుకున్నారు. చిత్ర బృందం అద్భుతంగా పనిచేసిందని.. దసరా లాంటి మరెన్నో చిత్రాలు మనం ప్రేక్షకులకి అందించాలని ఇన్​స్టా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు ప్రభాస్​​.

మరోవైపు అప్పుడే శ్రీకాంత్ నెక్స్ట్​ ప్రాజెక్ట్​లపై పుకార్లు షురూ అయ్యాయి. అక్కినేని అఖిల్​తో త్వరలో ఆయన ఓ సినిమా చేయబోతున్నారనే ప్రచారం సాగుతోంది. సూపర్​ స్టార్ మహేశ్​ బాబుతోనూ మూవీ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది​.

Last Updated : Apr 4, 2023, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.