ETV Bharat / entertainment

అందులో అవినీతి జరిగిందో లేదో తెలీదు.. నాకు పెద్దరికం వద్దు: చిరు

పెద్దరికం అనుభవించాలని లేదని, తనకు ఎలాంటి కుర్చీలు వద్దని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. కళాకారుల సంక్షేమం కోసం తానెప్పుడూ ముందుంటానని తెలిపారు.

chitrapuri houses chiranjeevi
చిత్రపురి ఇళ్లు చిరంజీవి
author img

By

Published : Dec 29, 2022, 2:08 PM IST

పరిశ్రమలో పెద్దరికం అనుభవించాలనే ఉద్దేశం తనకు లేదని, తనకంటే చాలా మందే పెద్దవాళ్లు ఉన్నారని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. తనకు ఎలాంటి కుర్చీలూ వద్దని పేర్కొన్నారు. కేవలం కళాకారుల సంక్షేమం కోసం తానెప్పుడూ ముందుంటానని తెలిపారు. సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనీలో నిర్మించిన నూతన గృహ సముదాయాన్ని గురువారం చిరంజీవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోనే ఇలా మాట్లాడారు.

"సినిమా షూటింగ్స్‌, ఇతర కార్యక్రమాలతో ఈరోజు నేను కాస్త బిజీగా ఉన్నాను. దాంతో ఈ కార్యక్రమానికి రాలేనని చెబుదామనుకున్నా. సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజున చిత్రపురి కాలనీకి శంకుస్థాపన జరిగిందని.. అందుకే ఇదే రోజున ఈ గృహ సముదాయాన్ని ప్రారంభించాలనుకుంటున్నామని ఛైర్మన్‌ అనిల్‌ దొరై చెప్పారు. ఆయన చెప్పిన మాట విన్నాక ఇందులో భాగం కావాలని నిర్ణయించుకున్నా. ప్రోగ్రామ్స్‌ అన్నింటినీ వాయిదా వేసుకుని ఇక్కడికి వచ్చా. సినీ కార్మికులకు సైతం సొంత ఇల్లు ఉండాలనేది ఒక పెద్ద కల. ఆ కల సాకారం చేయడం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక అభినందనలు. ఈ సందర్భంగా మనం డాక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డిని గుర్తు చేసుకుని ఆయనకు నివాళులు అర్పించాలి. ఆయన సుదీర్ఘ ఆలోచన నేడు సాకారమైంది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలుగులోనే సినీ కార్మికులకు ఇటువంటి గృహ సముదాయం ఉంది.

ఈ గృహ సముదాయాన్ని నిర్మించడం కోసం కమిటీని ఏర్పాటు చేయగా మధ్యలో ఏవో అవకతవకలు జరిగాయన్నారు. దాని గురించి నాకు పూర్తి సమాచారం లేదు. కాబట్టి దానిపై మాట్లాడను. అనిల్‌ దొరై సారథ్యంలోని కొత్త కమిటీ అన్ని పనులను సజావుగా పూర్తి చేసిందని సి.కల్యాణ్‌, తమ్మారెడ్డి తెలిపారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు. మీకెప్పుడూ ఏ అవసరం వచ్చినా సరే నేను ముందు ఉంటాను. సి.కల్యాణ్‌, తమ్మారెడ్డి భరద్వాజ నన్ను ప్రతిసారీ పెద్ద అని చెబుతుంటారు. వాళ్లు నాకంటే చిన్నవాళ్లు అనిపించుకోవడం కోసం నన్ను పెద్ద అంటున్నారు (నవ్వులు). నిజం చెప్పాలంటే వాళ్లే పెద్దలు. వాళ్లకు అండగా నేను ఉంటాను. అలాగే, సినీ కార్మికులు, కళాకారులు నాకు కుటుంబసభ్యులతో సమానం. వాళ్లకు ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటాను. ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతాను. భగవంతుడు నేను అనుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చాడు. దానిలో కొంతభాగాన్ని ఏదో ఒకరకంగా కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నా. పెద్దరికం అనుభవించాలనే ఆలోచన నాకు లేదు. అవసరం వచ్చినప్పుడు తప్పకుండా భుజం కాస్తా" అని చిరంజీవి వివరించారు.

ఇదీ చూడండి: బాలయ్యపై బాలీవుడ్ యాక్టర్​ ప్రశంసలు.. అలా చూసి ఆశ్చర్యపోయారట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.