ETV Bharat / entertainment

చిరు, ఉపాసన.. వీరిద్దరిలో చరణ్‌ ఎవరికి భయపడతారంటే? - చిరంజీవి ఆచార్య

Chiranjeevi Acharya pre release event: 'ఆచార్య' ప్రీ రిలీజ్ ఈవెంట్​ హైదరాబాద్​లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో భాగంగా చిరంజీవి, చరణ్‌, చిత్ర దర్శకుడు కొరటాల శివను సుమ కొన్ని సరదా ప్రశ్నలు అడిగారు. ఆ సంగతులు..

Acharya pre release event funny questions
చిరంజీవి ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్
author img

By

Published : Apr 24, 2022, 12:08 PM IST

Chiranjeevi Acharya pre release event: చిరంజీవి, ఉపాసన.. వీళ్లిద్దరిలో చరణ్‌ ఎక్కువగా ఎవరికి భయపడతారో తెలుసా?.. చిరంజీవి, చరణ్‌ వీళ్లిద్దరిలో బెస్ట్‌ డ్యాన్సర్‌ ఎవరు?.. చిరంజీవికి ఇష్టమైన వంటకం ఏదో తెలుసా?.. ఇలాంటి ఎన్నో సరదా ప్రశ్నలకు వేదికైంది 'ఆచార్య' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌. మెగాస్టార్‌ చిరంజీవి, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఆచార్య' ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని పోలీస్‌ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక ఘనంగా నిర్వహించారు. వేడుకలో భాగంగా చిరంజీవి, చరణ్‌, చిత్ర దర్శకుడు కొరటాల శివను సుమ కొన్ని సరదా ప్రశ్నలు అడిగారు.

సుమ: మీ అమ్మగారి చేతి వంట బెస్టా? లేదా మీ సతీమణి సురేఖ చేతి వంట బెస్టా?

చిరంజీవి: నూటికి నూరు శాతం అమ్మే. అమ్మ ప్రేమ, అమ్మ చేతి వంట, గుండెలకు హత్తుకుని ఆమె చూపించే ప్రేమాభిమానం.. దానికి మించిన తీపిదనం, కమ్మదనం ఎక్కడైనా ఉంటుందా..! (మధ్యలో సుమ అందుకుని.. సురేఖ గారు ఈ విషయం గుర్తుపెట్టుకుందాం. భార్యలు ఎంత కష్టపడి వంట చేసినా ఫైనల్‌గా అత్తగార్లకే మార్కులు వెళతాయి) (నవ్వులు)

సుమ: పవన్‌కల్యాణ్‌ లేదా చిరంజీవి.. వీళ్లిద్దరిలో ఎవరు మీకు ఆచార్య?

రామ్‌చరణ్‌: మొదట ఈ ప్రశ్న మిమ్మల్ని అడగమని చెప్పిన వారిని ఒక్కసారి ఇటు రమ్మని చెప్పండి (నవ్వులు). ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం. ఆచార్యుల నుంచి వాతలు పడతాయి.. కాబట్టి వద్దు.

చిరంజీవి: చరణ్‌ తరఫున ఈ ప్రశ్నకు సమాధానం నేను చెబుతాను. చరణ్‌.. నా నుంచి క్రమశిక్షణ.. వాళ్ల బాబాయ్‌ని చూసి చిలిపి అల్లరి నేర్చుకున్నాడు.

సుమ: నిర్మాత చరణ్‌ లేదా యాక్టర్‌ చరణ్.. ఎవరితో వర్క్‌ చేయడానికి మీరు సౌకర్యవంతంగా ఫీలయ్యారు?

రామ్‌చరణ్‌: నేను ఈ చిత్రాన్ని నిర్మించలేదండి. కొణిదెల ప్రొడెక్షన్‌ పేరు వేశాం కానీ.. కర్త, కర్మ అన్నీ నిరంజన్‌ రెడ్డినే. సెట్‌లోకి నటుడిగానే వెళ్లాను. ప్రొడ్యూసర్‌గా వెళ్లలేదు.

కొరటాల శివ: నాకెప్పుడూ యాక్టర్‌ చరణ్‌తోనే సౌకర్యంగా ఉంటుంది.

సుమ: చిరంజీవి, చరణ్‌ వీళ్లిద్దరిలో బెస్ట్‌ డ్యాన్సర్‌ ఎవరు?

రామ్‌చరణ్‌: చిరంజీవి

చిరంజీవి: నా పేరు శివ శంకర వరప్రసాద్‌. శివుడు నృత్యానికి ప్రసిద్ధి. శివుడు ముందు ఎంతోమంది డ్యాన్స్‌లు వేస్తారు. దాన్నే డ్యాన్స్‌ అని ఫీలవుతుంటారు. అది ఎవరైనా సరే.. శివుడి తర్వాతే. ఆయన తాండవం తర్వాతే.

కొరటాల శివ: ఈ శివుడిది కూడా అదే సమాధానం.

చిరంజీవి: ఎదుటివాళ్లని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడు నేనే కావాలని తగ్గి.. వాళ్లకు అవకాశం ఇస్తుంటాను.

కొరటాల శివ: ‘భలే భంజారా’ సాంగ్‌ షూటింగ్‌ అప్పుడు.. ఫస్ట్‌ లైవ్‌లో చిరంజీవి డ్యాన్స్‌నే చూశాను. ఆ తర్వాతే చరణ్‌ని చూశాం.

సుమ: ఒక సినిమాకి డైరెక్టర్‌ లేదా యాక్టర్.. ఎవరు ఎక్కువ?

చిరంజీవి: దర్శకుడు. అందులో ఎలాంటి సందేహం లేదు. దర్శకుడి వల్లే ఏదైనా సాధ్యమవుతుంది. ఒక సినిమా పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు చేరువ కావాలంటే దానికి దర్శకుడే మూలం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సుమ: వీళ్లిద్దరిలో ఎవరికి మీరు ఎక్కువగా భయపడతారు? ఉపాసన? లేదా నాన్న?

రామ్‌చరణ్‌: అది తెలియదు కానీ.. ఇంట్లో వాళ్లందరికీ మా అమ్మే బాస్‌. అమ్మ ముందు నాన్న చాలా జాగ్రత్తగా ఉంటారు. అదే నేనూ నేర్చుకున్నా. ఉపాసన ముందు కొంచెం జాగ్రత్తగా ఉంటాను.

చిరంజీవి: అది నన్ను చూసి నేర్చుకున్నావా.. అయితే సుఖ పడతావ్‌. వాళ్లతో పెట్టుకోవద్దు

సుమ: ఈ రెండు జంటల్లో మీకు ఏ జోడీ అంటే ఎక్కువ ఇష్టం? చిరు-చరణ్‌? ఆచార్య-సిద్ధ?

కొరటాల శివ: నాకు ఆచార్య-సిద్ధ అంటే ఇష్టం.

సుమ: శివ రాసిన పాత్రల్లో మీకు బాగా నచ్చిన పాత్ర ఆచార్య? లేదా సిద్ధ?

చిరంజీవి: ఈ రెండింటినీ ఓపెన్‌గా పెట్టి నన్ను చేయమంటే నేను సిద్ధ ఎంచుకుంటాను. సిద్ధ క్యారెక్టర్‌లో అన్ని వెరియేషన్స్‌ ఉన్నాయి. (ఆ తర్వాత మధ్యలో చిరు ఆగిపోయి.. తనకు తానే చెప్పొద్దు ఆపేయ్‌ అని చెప్పుకోవడంతో అక్కడే ఉన్న రాజమౌళి నవ్వులు పూయించారు.)

సుమ: మిమ్మల్ని ఎక్కువగా ఒత్తిడికి గురి చేసింది ఏమిటి? కరోనా వల్ల ఆలస్యం కావడమా? లేదా చిరు లీక్సా‌?

కొరటాల శివ: చిరంజీవి లీక్‌ చేస్తే బాగుండనేది నా భావన. ఆయన లీక్‌ చేయడం వల్ల దాని రీచ్‌ ఎక్కువగా ఉంటుంది. అది సరదాగా ఉన్నప్పటికీ సెన్సేషన్‌ అవుతుంది.

చిరంజీవి: నేను లీక్‌ చేయడం కాదు. ఇదంతా ఒక మాస్టర్‌ ప్లాన్‌. వాళ్లకు ఖర్చు లేకుండా నా నోటి ద్వారా చెప్పించాలనే ఇలా చేస్తున్నారు.

సుమ: మీకు బాగా ఇష్టమైన ఫుడ్‌ ఏమిటి? నాటు కోడి? చేపల పులుసు?

చిరంజీవి: చేపల పులుసు

సుమ: సన్‌ ఆఫ్‌ మెగాస్టార్‌, మెగా పవర్‌స్టార్‌.. వీటిలో దేనికి మీరు ఎక్కువగా గర్వపడుతుంటారు?

రామ్‌చరణ్‌: మెగాస్టార్‌, పవర్‌స్టార్‌ ఉన్న కుటుంబంలో నేనూ ఉండటం నేనెంతో గర్వంగా ఫీలవుతుంటాను.

ఇదీ చూడండి: రాజమౌళి వల్లే 'ఆచార్య'లో నటించా!: చిరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.