ETV Bharat / entertainment

పవన్ 'బ్రో' టీజర్ వచ్చేసిందోచ్​.. మామ-అల్లుడు అదరగొట్టేశారు

author img

By

Published : Jun 29, 2023, 6:57 PM IST

Updated : Jun 29, 2023, 7:43 PM IST

Bro movie teaser : పవర్ స్టార్​ పవన్‌ కల్యాణ్‌ 'బ్రో' టీజర్ రిలీజై ఆకట్టుకుంటోంది. మీరు ఓ లుక్కేయండి...

Pawankalyan  Saitej Bro movie teaser released

Bro movie teaser : పవర్ స్టార్​ పవన్‌ కల్యాణ్‌.. ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న చిత్రం 'బ్రో'. సముద్రఖని తెరకెక్కిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే పవన్‌, సాయితేజ్‌ల ఫస్ట్‌లుక్‌లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా టీజర్​ రిలీజై ఆకట్టుకుంటోంది. ఇందులో పవన్‌కల్యాణ్‌ - సాయిధరమ్‌ తేజ్‌ మధ్య వచ్చే సంభాషణలు సినీ ప్రియులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఫుల్ ట్రెండ్​ అవుతున్న ఈ టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి.

Pawan kalyan bro movie : ఇక ఈ టీజర్ విషయానికి వస్తే.. పవన్​ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా ప్రచార చిత్రాన్ని కట్​ చేశారు. పోస్టర్​లో చూపించినట్టే.. 'తమ్ముడు' సినిమాలో రైల్వే కూలీ గెటప్‌ను రీక్రియేట్ చేశారు. 'ఏంటిగి.. ఇంత చీకటిగా ఉంది.. ఎవండి ఎవరూ లేరా.. హలో మాస్టరూ.. గురువు గారు.. హలో తమ్ముడు.. బ్రో' అని తేజ్​ డైలాగులు చెప్పడంతో టీజర్ ప్రారంభమైంది. 'కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం' అంటూ తన మార్క్​ స్టైల్​లో కాలం గురించి పవన్ చెప్పే డైలాగ్​లు బాగానే ఉన్నాయి. అయితే ఈ ప్రచార చిత్రంలో యాక్షన్ యాంగిల్ ఏమీ చూపించలేదు. మరి సినిమాలోనైనా ఉన్నాయో లేదో. సాయి తేజ్ కూడా చిత్రంలో మార్క్ అనే సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్​గా చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అదరగొట్టేశారు. మొత్తంగా టీజర్ ఓ ఫన్ రైడ్​గా సాగింది. ప్రమాదంలో చనిపోయిన సాయి తేజ్​కు మరో అవకాశం ఇవ్వడానికి.. భూమి మీదకు వచ్చిన మోడ్రన్​ దేవుడిగా పవన్ కనిపించారు. మరో రెండో అవకాశం అందుకున్న తేజ్.. తన జీవితంలో ఎలాంటి మార్పులను చూశారనేది ఈ సినిమా కథాంశం. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్​లో చిందులేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Pawan kalyan sai dharam tej movie : ఇక ఈ 'బ్రో' సినిమాకు.. మాస్ మహారాజా రవితేజ నటించిన 'శంభో శివ శంభో', నేచురల్ స్టార్ నాని నటించిన 'జెండా పై కపిరాజు' చిత్రాలకు దర్శకత్వం వహించిన సముద్రఖనినే దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో ఈ చిత్రం 'వినోదయ సీతమ్​' పేరుతో సముద్రఖని స్వీయ దర్శకత్వంలో రూపొందింది సూపర్​ హిట్​ను అందుకుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జులై 28న తేదీన సినిమా గ్రాండ్​ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కానుంది.

ఇదీ చూడండి :

జూలై నుంచి అక్టోబర్​ వరకు ముందుందిగా సినిమా పండగ!

'OG సీన్స్​ చూశాక దిమ్మ తిరిగిపోయింది'.. పవన్ ఫ్యాన్స్​కు కిక్ ఇచ్చే న్యూస్!

Last Updated : Jun 29, 2023, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.