BREAKOUT TRAILER LAUNCH BY ALLU ARJUN: ప్రముఖ నటుడు బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రం 'బ్రేక్ అవుట్'. సుబ్బు చెరుకూరి దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ మోదుగ నిర్మాత. సర్వైవల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్‌ని సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ విడుదల చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్ ఆసక్తిగా ఉందంటూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కేవలం కథానాయకుడి పాత్రతోనే తీర్చిదిద్దిన ఈ ప్రచారం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. మోనోఫోబియా అనే వ్యాధితో బాధపడుతున్న హీరో తన స్నేహితుడితో ఫోన్‌లో మాట్లాడే సంభాషణలతోనే ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెరిగేలా ఉన్నాయి. రాజా తన లుక్, నటన విషయంలో చాలా కొత్తగా కనిపించారు.
మరి, రాజా అంతగా భయపడేందుకు కారణమేంటి? మోనోఫోబియా నుంచి విముక్తి పొందాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. చిత్రం శ్రీను, కిరీటి, బాల కామేశ్వరి, ఆనంద చక్రపాణి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి ఛాయాగ్రహణం: మోహన్‌చారి, సంగీతం: జోన్స్ రూపర్ట్. 'పల్లకిలో పెళ్లికూతురు' సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాజా గౌతమ్ ఆ తర్వాత 'బసంతి', 'మను' అనే విభిన్న కథా చిత్రాలతో మెప్పించారు.
ఇదీ చదవండి:
ఉప్పొంగిన అభిమానం, అమెరికాలో ఇంటి ముందు స్టార్ హీరో విగ్రహం