Boney Kapoor On Sridevi Death : అందాల తార, అలనాటి కథానాయిక శ్రీదేవి గురించి ఆమె భార్త బోణీ కపూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మరణం గురించి సంచలన విషయాలు చెప్పారు. శ్రీదేవి నాజూకుగా కనిపించడం కోసం స్ట్రిక్ట్ డైట్ తీసుకునేదని.. ఉప్పు లేకుండా ఆహార పదార్థాలు తినేదని తెలిపారు. డాక్టర్లు వారించినా పట్టుకునేది కాదని వెల్లడించారు. ఇదే ఆమె మరణానికి దారి తీసిందని చెప్పారు.
''తెరపై అందంగా కనిపించేందుకు శ్రీదేవి తరచూ స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతుండేది. తను అలా డైట్ ఫాలో అవుతుందనే విషయం వివాహం అయ్యాకే నాకు తెలిసింది. ఉప్పు లేకుండా భోజనం చేసేది. దీంతో ఆమె నీరసించి పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. శ్రీదేవికి లోబీపీ సమస్యలు ఉన్నాయని, జాగ్రత్తగా ఉండమని డాక్టర్లు ఎంతగానో వారించారు. కానీ ఆమె వైద్యుల మాటలను సీరియస్‌గా తీసుకోలేదు''
--బోణీ కపూర్, దివంగత నటి శ్రీదేవీ భర్త
Sridevi Death Reason : అయితే శ్రీదేవిది సహజ మరణం కాదని.. ప్రమాదవశాత్తు మరణించిందని బోణీ కపూర్ తెలిపారు. ఆమె చనిపోయిన తర్వాత దుబాయ్ పోలీసులు తనను 24 గంటల పాటు విచారించారని చెప్పారు. 'నిజం ఏంటో తెలుసుకునేందుకు నాకు లై డిటెక్టర్ పరీక్షలు కూడా చేశారు. ఇండియన్ మీడియా నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్లే నన్ను అన్ని విధాలుగా విచారణ చేస్తున్నట్లు చెప్పారు. శ్రీదేవి మరణంలో ఎలాంటి కుట్రకోణం లేదని చివరకు వారు నిర్ధరించారు. ఆమె మరణం తర్వాత నటుడు నాగార్జున నన్ను కలిశారు. క్రాష్ డైట్ కారణంగా శ్రీదేవి ఓసారి సెట్‌లో సృహతప్పి పడిపోయిందని తెలిపారు. ఆ సమయంలో ఆమె ఒక పన్ను కూడా విరిగిందని చెప్పారు' అని బోణీ కపూర్ వివరించారు.
Sridevi Death Date : 2018లో బంధువుల వివాహం వేడుక కోసం దుబాయ్‌కు వెళ్లిన శ్రీదేవి ఫిబ్రవరి 24న తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది ఫిబ్రవరికి అతిలోక సుందరి శ్రీదేవి ఈ లోకాన్ని విడిచివెళ్లి ఐదేళ్లు అయింది.
శ్రీదేవి.. ఓ మరపురాని అద్భుతం.. చెదిరిపోని జ్ఞాపకం
Sridevi 60th Birth Anniversary : ఎన్నేళైనా తగ్గని శ్రీదేవి చరిష్మా.. డూడుల్‌తో గౌరవించిన గూగుల్