Balakrishna 107 movie update: బాలకృష్ణ-గోపిచంద్ మలినేని కాంబోలో ఓ పవర్ఫుల్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్‌గా నటిస్తుండగా, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే జూన్ 10 బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఓ మాస్ అప్డేట్ను ఇచ్చింది మూవీటీమ్. ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఫస్ట్ హంట్ లోడింగ్.. సింహం వేటకి సిద్ధమైంది అంటూ క్యాప్షన్ జోడించింది. దీంతో నందమూరి అభిమానుల్లో ఫుల్ జోష్ పెరగగా.. బాలయ్య బర్త్‌డేన మాస్ అప్డేట్ రాబోతున్నట్లు ఆశిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది.
Kritishetty Dhanush: 'ఉప్పెన' బ్యూటీ కృతిశెట్టి జోరు తగ్గేలా లేదు. వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ కెరీర్లో దూసుకెళ్తోంది. తాజాగా ఇప్పుడీ ముద్దుగుమ్మకు మరో సూపర్ ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. స్టార్ హీరో ధనుశ్ సరసన నటించేందుకు కమిట్ అయినట్లు సమాచారం. ధనుశ్ ప్రస్తుతం 'తిరుచిత్రాంబలం', 'నానే వరువేన్' చిత్రాల తర్వాత అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్గా ప్రియాంక మోహన్‌ను ఎంపిక చేశారు. అయితే ఇప్పుడామె డేట్స్ ఖాళీలేక తప్పుకుంది. తాజాగా ఆమె స్థానంలో కృతిని తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 'ఉప్పెన', 'శ్యామ్‌సింగరాయ్', 'బంగార్రాజు'లతో హిట్‌ను అందుకున్న ఈ యంగ్ బ్యూటీ.. తమిళంలో 'ది వారియర్', సూర్య-బాల చిత్రాల్లో.. తెలుగులో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', 'మాచర్ల నియోజకవర్గం'లోనూ నటిస్తోంది.
ఇదీ చూడండి: షో మధ్యలో హైపర్ ఆదిని అరెస్ట్ చేసిన పోలీసులు!