నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో 'ఆదిత్య 369' ఒకటి. సింగీతం శ్రీనివాసరావు దర్శకుడు. అప్పట్లో వచ్చిన ఈ చిత్రం ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెలిసిందే. ఆ చిత్రానికి కొనసాగింపుగా 'ఆదిత్య 999 మాక్స్' సినిమా చేయబోతున్నట్లు గతంలో బాలకృష్ణ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు మళ్లీ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. దీంతో ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందో లేదో అనునుకున్నారు. తాజాగా 'ఆదిత్య 999' సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని బాలకృష్ణ స్పష్టం చేశారు.
వచ్చే ఏడాది ఆదిత్య 999 సీక్వెల్ చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. ఆ చిత్రానికి తానే దర్శకత్వం వహించబోతున్నట్లు స్పష్టం చేశాకు. యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన దాస్ కా ధమ్కీ ట్రైలర్ హైదరాబాద్ ఏఎంబీ మాల్లో బాలయ్య లాంఛనంగా ఆవిష్కరించారు.
ఇక విశ్వక్ గురించి మాట్లాడుతూ.. "అప్పుడప్పుడూ కొన్ని సినిమాల్ని చూస్తున్నప్పుడు వాటిలో నన్ను నేను ఊహించుకుంటా. నాకు అన్నీ చేయాలని ఉంటుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే నేనే చేశాననేంతగా తృప్తిని కలిగించారు విశ్వక్సేన్. ట్రైలర్ కనులవిందుగా ఉంది. రచన, నృత్యాలు, కెమెరా పనితనం బాగున్నాయి. విష్వక్ సినిమాపై తపనతో పనిచేస్తుంటారు. ఎన్నో ఒడుదొడుకుల్ని దాటుకుని ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. దర్శకుడిగా, నిర్మాతగా, హీరోగా.. ఇలా అన్నీ తానై, తన బృందానికి స్ఫూర్తినిస్తూ ఈ సినిమాని పూర్తి చేశారు. ఇప్పుడున్న యువతరంలో ఇలా చేయడం చాలా అరుదు" అని చెప్పారు.
ఇదీ చూడండి: ఈ అందాల ముద్దుగుమ్మలు డాక్టర్లు కూడా