ETV Bharat / entertainment

August Weekend Release Films : వీకెండ్​లో ఇంట్రెస్టింగ్​ సినిమాలు.. ఈ వారం బాక్సాఫీస్​ హీరో ఎవరో ? - బెదురులంక 2102 రిలీజ్​ డేట్

August Weekend Release Films : గత వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడేమీ కనిపించలేదు. హిట్స్​, వసూళ్లు లేక అంత చప్పగానే సాగింది. అయితే ఈ వారం బాక్సాఫీస్​, ఓటీటీ ముందు పలు ఇంట్రెస్టింగ్​ చిత్రాలు, సిరీస్​లు రిలీజ్​కు రెడీ అయ్యాయి. మరి వీటిలో ఏ చిత్రం హిట్ అందుకుంటుంది? ఎవరు ఈ వారం బాక్సాఫీస్ హీరోగా నిలుస్తారోనని అందరికీ ఆసక్తి ఏర్పడింది. ఇంతకీ ఈ వారం ఏయే సినిమాలు రానున్నాయంటే ?

August Weekend Release Films
August Weekend Release Films
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2023, 2:12 PM IST

Updated : Aug 23, 2023, 2:26 PM IST

August Weekend Release Films : గత వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడేమీ కనిపించలేదు. హిట్స్​, వసూళ్లు లేక అంత చప్పగానే సాగింది. సంతోశ్ శోభన్ ప్రేమకుమార్​, బిగ్​బాస్​ సోహెల్ మిస్టర్ ప్రెగ్నెంట్​ రిలీజ్​కు ముందు ఇంట్రెస్ట్​ పుట్టించినప్పటికీ.. అవి బాక్సాఫీస్​ ముందు బోల్తా కొట్టాయి. దీంతో మూవీ లవర్స్​.. ఈ వారం సినిమాలపై చూస్తున్నారు. అయితే ఈ వారం బాక్సాఫీస్​, ఓటీటీ ముందు పలు ఇంట్రెస్టింగ్​ చిత్రాలు, సిరీస్​లు రిలీజ్​కు రెడీ అయ్యాయి.

మరి వీటిలో ఏ చిత్రం హిట్ అందుకుంటుంది? ఎవరు ఈ వారం బాక్సాఫీస్ హీరోగా నిలుస్తారోనని అందరికీ ఆసక్తి ఏర్పడింది. అయితే ఈ వీకెండ్ మలయాళ హీరో దుల్కర్ సల్మాన్​ నటించిన డబ్బింగ్ సినిమా 'కింగ్ ఆఫ్ కోథా' షురూ అవ్వనుంది. ఆగస్ట్ 24న విడుదల కానున్న ఈ చిత్రం.. గ్యాంగ్​ స్టర్ నేపథ్యంలో రావడంతో మంచి ఆసక్తి నెలకొంది. పైగా మాలీవుడ్​ నుంచి రానున్న తొలి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. కంటెంట్ క్లిక్​ అవుతుందో లేదో మరి.

Varun Tej Gandheevadhari Arjuna : ఇక ఈ చిత్రానికి పోటీగా ఆగస్ట్ 25న రెండు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మెగా ప్రిన్స్​ వరుణ్‌ తేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'గాండీవధారి అర్జున', కార్తికేయ-నేహా శెట్టి 'బెదురు లంక 2012'(karhtikeya bedurulanka ) విడుదల కానున్నాయి. కానీ ఈ రెండు చిత్రాలపై పెద్దగా బజ్ క్రియేట్ అవ్వలేదనిపిస్తోంది. మొదటి రోజు తొలి షో టాక్ ఆధారంగా ఈ చిత్రాల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఇంకా ఈ ఆగస్టు 25న హిందీ చిత్రం చిత్రం డ్రీమ్ గర్ల్​ 2, కన్నడ చిత్రం రాజ్​ బీ శెట్టి 'టాబీ' కూడా ఆడియెన్స్​ను పలకరించనున్నాయి. ఇక్కడ వీటికి కాస్త డిమాండ్​ తక్కువగానే ఉన్నాయి.

ఆగస్ట్​ 26న.. యూత్​ఫుల్ ఎంటర్​టైనర్​ బాయ్స్​ హాస్టల్​ రానుంది. కన్నడలో ఈ చిత్రం చిన్న సినిమాగా రిలీజై ఘనవిజయం సాధించింది. ఇక్కడ కూడా మంచి బజ్ క్రియేట్ అయింది. మరి ఇది ఎలాంటి​ వండర్స్ క్రియేట్ చేస్తుందో..

థియేటర్లలో రిలీజ్​ కానున్న ఈ చిత్రాల్లో ఏవి క్లిక్ అవుతాయో చూడాలి మరి. ఒకవేళ ఇవి సక్సెస్​ కాలేకపోయినా.. ఓటీటీలో పవన్​ కల్యాణ్​ బ్రో, ఆహాలో ఆనంద్​ దేవరకొండ బేబీ చిత్రాలు ఆగస్ట్ 25న రిలీజ్​కు రెడీ అయ్యాయి. చూడాలి మరి ఈ వారం బాక్సాఫీస్ వసూళ్లు ఎలా ఉంటాయో, ఎవరు బాక్సాఫీస్​ హీరో అవుతారో?

Last Updated : Aug 23, 2023, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.