Atlee Dream Project With Ajith Kumar : 'జవాన్' సినిమాతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ డైరెక్టర్ అట్లీ. స్టార్ హీరో షారుక్ ఖాన్ - లేడీ సూపర్‌స్టార్ నయనతార లీడ్ రోల్స్‌లో ఈ సినిమా తెరకెక్కింది. ఇక సెప్టెంబర్ 7న రిలీజైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచి రూ. 1000 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే 'జవాన్' తర్వాత ఈ దర్శకుడి నుంచి ఎలాంటి సినిమా వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలో పలు ఇంటర్వ్యూల్లో తన కొత్త ప్రాజెక్ట్స్ గురించి చెప్పారు అట్లీ. తాజాగా షారుక్ ఖాన్- విజయ్‌లతో సినిమా చేస్తున్నట్లు చెప్పిన అట్లీ.. ఇప్పుడు మరో స్టార్ హీరో అజిత్ కుమార్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
అజిత్ కుమార్ అంటే ఇష్టమని.. త్వరలోనే ఆయనతో సినిమా తీసే రోజు కోసం ఎదురుచూస్తున్నట్లు అట్లీ చెప్పారు. హీరో కోసం స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. " అజిత్ కుమార్‌కు సరిపోయే స్టోరీ నా దగ్గర ఉంది. దానిపై ఇంకా వర్క్ చేయాలి. ఆ స్టోరీ గురించి ఆయనకు చెప్పాలని ప్రయత్నించా.. కానీ కుదరలేదు. ఒకవేళ అజిత్ అంగీకరిస్తే.. అది సూపర్ హిట్ సినిమా అవుతుంది. ఆయన రమ్మని పిలవడమే ఆలస్యం వెళ్లి కథ గురించి చెబుతాను. ఆయన చాలా మంచి మనిషి.. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి ఓదార్చారు." అని చెప్పారు.
-
Director @Atlee_dir : I love Ajith sir very much!, definitely want to work with him. If he says yes, I will definitely do it. so definitely got a killer script 😎🔥
— Worldwide Thala Fans (@WorldwideThala) November 15, 2023 s://platform.twitter.com/widgets.js" charset="utf-8">" class="align-text-top noRightClick twitterSection" data="
Latest Interview 💥#AK64 #VidaaMuyarchi #AjithKumar pic.twitter.com/32sm1gdBWX
s://platform.twitter.com/widgets.js" charset="utf-8">">Director @Atlee_dir : I love Ajith sir very much!, definitely want to work with him. If he says yes, I will definitely do it. so definitely got a killer script 😎🔥
— Worldwide Thala Fans (@WorldwideThala) November 15, 2023
Latest Interview 💥#AK64 #VidaaMuyarchi #AjithKumar pic.twitter.com/32sm1gdBWX
s://platform.twitter.com/widgets.js" charset="utf-8">Director @Atlee_dir : I love Ajith sir very much!, definitely want to work with him. If he says yes, I will definitely do it. so definitely got a killer script 😎🔥
— Worldwide Thala Fans (@WorldwideThala) November 15, 2023
Latest Interview 💥#AK64 #VidaaMuyarchi #AjithKumar pic.twitter.com/32sm1gdBWX
తాజాగా అట్లీ.. భారీ మల్టీస్టారర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. షారుక్- విజయ్‌లతో చేసే సినిమా కచ్చితంగా రూ.3000కోట్లు వసూళ్లు చేస్తుందన్నారు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక వీటితో పాటు అల్లు అర్జున్‌తో కూడా అట్లీ ఓ సినిమా తీయనున్నారని టాక్. ఇప్పటికే అల్లు అర్జున్‌తో కలిసి కథపై చర్చలు కూడా జరిపారని.. ఇటీవలే ముంబయిలో కూడా కలిసినట్లు వీడియోలు బయటకు వచ్చాయి! దీంతో ఇక ఈ సినిమా దాదాపుగా ఖరారైపోయిందని అంతా అనుకుంటున్నారు. ఇక అధికార ప్రకటన కూడా త్వరలోనే వచ్చేస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇదంతా చూసిన అభిమానులు.. అట్లీ లైనప్ పెద్దదే అంటున్నారు.
Atlee Rajinikanth : రజనీ డూప్‌గా రోబోలా కనిపించింది అట్లీనా?.. ఆయన కెరీర్ ఎలా మొదలైందంటే?