ETV Bharat / entertainment

అశ్విన్​ అరుదైన ఘనత.. కుంబ్లే రికార్డులు బద్దలు.. ఆసీస్​కు పీడకలే! - రవిచంద్రన్​ అశ్విన్​ లేటెస్ట్ అప్డేట్స్

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా ఆసిస్​తో జరుగుతున్న నాలుగో టెస్ట్​ మ్యాచ్​లో కంగారు టీమ్​ దూకుడుగా వెళ్తోంది. అయినప్పటికీ మన టీమ్​ ఇండియా బౌలర్లు వారికి బంతితో సమాధానం చెప్తున్నారు. ఈ క్రమంలో భారత బౌలర్​ రవిచంద్రన్​ అశ్విన్​ ఓ అరుదైన రికార్డును సాధించాడు. అదేంటంటే..

r ashwin
r ashwin
author img

By

Published : Mar 11, 2023, 8:24 AM IST

Updated : Mar 11, 2023, 8:52 AM IST

అహ్మదాబాద్​ వేదికగా బోర్డర్​ గావస్కర్ ట్రోఫీ నాలుగో టెస్ట్ సిరీస్ ఎంతో ఉత్కంఠంగా సాగుతోంది. ఓ వైపు ఆసీస్​ ప్లేయర్స్​ క్రీజులో దుమ్ములేపుతుంటే మరో వైపు మన భారత బౌలర్లు కూడా తగ్గేదే లే అన్నట్లు చెలరేగిపోయారు. ఈ క్రమంలో టీమ్ ఇండియా ప్లేయర్​ రవిచంద్రన్​ అశ్విన్​ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ఓ అరుదైన రికార్డును దక్కించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి.. కంగారూ జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డుకెక్కాడు. అంతేకాకుండా భారత్‌లో ఎక్కువ సార్లు ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గానూ చరిత్ర సృష్టించాడు. అయితే గతంలో ఈ రెండు రికార్డులు మాజీ క్రికెటర్​ అనిల్ కుంబ్లే పేరిట ఉండగా.. ఇప్పుడా రికార్డులను అశ్విన్ బద్దలు కొట్టాడు.

గతంలో టీమ్​ ఇండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే.. ఆస్ట్రేలియా జట్టుపై 111 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆసీస్‌తో జరిగిన నాలుగో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో‌ అశ్విన్.. ఆరు వికెట్లు తీశాడు. దీంతో ఆసీస్​పై అశ్విన్ తీసిన వికెట్ల సంఖ్య 113కు చేరినట్లైంది. అది కూడా ఆస్ట్రేలియాతో జరిగిన 26 మ్యాచ్‌ల్లో 46 ఇన్నింగ్స్‌ల్లోనే అశ్విన్‌ ఈ వికెట్లు తీశాడు. అతని బౌలింగ్ సగటు 31.92గా ఉంది. దీన్ని బట్టి ఆస్ట్రేలియాపై అశ్విన్ రికార్డు ఏ రేంజ్​లో ఉందో అర్థమవుతోంది.
ఇక కుంబ్లే చేసిన మరో రికార్డుపై కూడా అశ్విన్ ఓ కన్నేశాడు. భారత్‌లో అనిల్ కుంబ్లే 115 ఇన్నింగ్స్‌ల్లో 350 వికెట్లు తీయగా.. అశ్విన్ మాత్రం 106 ఇన్నింగ్స్‌ల్లోనే 336 వికెట్లను పడగొట్టాడు. స్వదేశంలో అశ్విన్ మరో 15 వికెట్లు తీస్తే.. ఈ రికార్డు కూడా బద్దలు అవుతుంది.

మరోవైపు అశ్విన్ స్వదేశంలో టెస్టు క్రికెట్‌ ఫార్మాట్‌లో మొత్తం 26 సార్లు 5 వికెట్లు తీశాడు. గతంలో అనిల్ కుంబ్లే స్వదేశంలో మొత్తం 25 సార్లు 5 వికెట్లను పడగొట్టగా.. అహ్మదాబాద్ టెస్టులో అశ్విన్ 5 వికెట్లు తీసి ఆ రికార్డును తిరగ రాశాడు. దీంతో స్వదేశంలో అత్యధికసార్లు ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అటు టెస్టు క్రికెట్‌లో అశ్విన్ ఇప్పటివరకు 473 వికెట్లు తీశాడు. 113 వన్డేల్లో 151 వికెట్లు, 65 టీ20ల్లో 72 వికెట్లు అంతే కాకుండా 184 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 157 వికెట్లు పడగొట్టాడు.

ఇక మ్యాచ్​ విషయానికి వస్తే.. అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న టెస్టుల్లో ప్రస్తుతం ఆసీస్ బలంగా ఉంది. ఉస్మాన్ ఖవాజా, కామెరూన్ గ్రీన్ సెంచరీలతో చెలరేగడంతో వల్ల తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే కంగారూ జట్టుకు టీమ్ ఇండియా కూడా అంతే జోరుగా సమాధానం ఇస్తోంది. ఆటకు మూడో రోజు కీలకం కానుంది.

Last Updated : Mar 11, 2023, 8:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.