దర్శకధీరుడు రాజమౌళి ఈ పేరు ఓ సంచలనం. టాలీవుడ్ ఇండస్ట్రీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనది. ఇటీవలే ఆర్ఆర్ఆర్తో తానేంటో మరోసారి నిరూపించుకున్నారు. ఈ చిత్రం ఆస్కార్ బరిలో నిలుస్తుందని భారతీయులంతా ఆశ పడుతున్నారు. అయితే తాజాగా జక్కన గురించి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
"మగధీర సినిమా చూసినప్పుడు రాజమౌళి ఏదైనా సాధించగలరని నాకు అర్థమైంది. ఆ తర్వాత బాహుబలి సినిమా చూసి ఆశ్చర్యపోయాను. రాజమౌళి సినిమాలు తెలుగు సినిమా కీర్తిని పెంచేవిధంగా ఉంటాయి" అని అన్నారు. ఇక పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడిన ఈ సంగీత దిగ్గజం "రోజా, బొంబాయి, దిల్ సే.. ఇవ్వన్నీ పాన్ ఇండియా సినిమాలే" అని చెప్పారు. ఈ సందర్భంగా తాజాగా విడుదలైన పొన్నియిన్ సెల్వన్ గురించి మాట్లాడారు. ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించిందని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.
ఇదీ చూడండి: NBK107 Update : కర్నూలు నడిబొడ్డున బాలయ్య సింహ గర్జన!