AR Rahman Birthday : దిలీప్ కుమార్ అంటే ఎవ్వరికీ తెలియకపోవచ్చు. ఏఆర్ రెహమాన్ అంటే మ్యూజిక్ లవర్స్ ఇట్టే కనిపెట్టేస్తారు. ఆయన స్టార్డం అలాంటిది మరి. 'రోజా' సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన తొలి సినిమాతోనే ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్‌గా జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత పలు హిట్ ఆల్బమ్స్‌ను ఇండస్ట్రీకి అందించి నేషనల్గానే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులరయ్యారు. అలా మ్యూజిక్ ఇండస్ట్రీలోకి మెరుపు లాంటి వేగంతో అడుగుపెట్టిన రెహమాన్ అనతికాలంలోనే ఫేమస్ అయ్యారు. తెలుగు, తమిళ, హిందీలో ఎన్నో సినిమాలకు సంగీతం అందించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అయితే ఆయన జర్నీలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. తొమ్మిదేళ్ల వయసులోనే ఆయన తండ్రి మరణించారు. దీంతో ఇంట్లో సంగీత పరికరాలు అద్దెకిచ్చి కొన్నాళ్లపాటు రెహమాన్ జీవనం సాగించారు. చిన్నప్పటి స్నేహితులు శివమణి, జాన్ అంటోనీ, సురేశ్ పీటర్స్, జోజో, రాజాలతో కలిసి రెహమాన్ 'రూట్స్' అనే రాక్‌బ్యాండ్ కూడా పెట్టారు. నెమెసిస్ అవెన్యూ అనే రాక్ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేశారు. అలా తన మ్యూజికల్ జర్నీని మొదలెట్టారు.
-
50 years ago 😃 pic.twitter.com/rCe69p04vd
— A.R.Rahman (@arrahman) August 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">50 years ago 😃 pic.twitter.com/rCe69p04vd
— A.R.Rahman (@arrahman) August 16, 202250 years ago 😃 pic.twitter.com/rCe69p04vd
— A.R.Rahman (@arrahman) August 16, 2022
తొలుత డాక్యుమెంటరీలకు, యాడ్స్‌కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లను కంపోజ్ చేసిన రెహమాన్, ఆ తర్వాత మణిరత్నం 'రోజా' సినిమాతో సినీ కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ సినిమాలోని పాటలకు మ్యూజిక్ లవర్స్‌లో మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. 'జెంటిల్మెన్' సినిమాతో మరో సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు. ట్రెండీ సాంగ్స్‌కే కాదు జానపదాలకు కూడా చక్కని బాణీలు కట్టగలనని 'కిలక్కు చీమాయిలే' సినిమాతో నిరూపించుకున్నారు ఏఆర్ఆర్. ఇక ఆయనకు మరో నేషనల్ అవార్డును తెచ్చిపెట్టిన ఆల్బమ్ 'మెరుపు కలలు'. ఈ పాటలు తెలుగు, తమిళం, హిందీలోనూ సూపర్ హిట్స్‌గా నిలిచాయి.
ఇక 'డ్యూయెట్', 'బొంబాయి', 'జీన్స్', 'దిల్ సే', 'సంగమం', 'పడయప్ప', 'తాల్', 'సఖి', 'లగాన్', 'యువ', 'రంగ్ దే బసంతి', 'గురు', 'జోధా అక్బర్', 'రాక్ స్టార్', 'మెర్సల్', 'పొన్నియిన్ సెల్వన్', సినిమాలకు చక్కటి బాణీలను అందించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఆయన కెరీర్లో ఎన్నో సూపర్ హిట్సే కాకుండా, ఎన్నో అవార్డులను సైతం అందుకున్నారు. 'స్లమ్‌డాగ్ మిలియనీర్' సినిమాలోని 'జయహో' పాటకు ఆయన్ను రెండు ఆస్కార్లు వరించాయి. ఇక కేంద్ర ప్రభుత్వం రెహమాన్‌ను 'పద్మశ్రీ','పద్మ భూషణ్' లాంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలతోనూ సత్కరించింది. అంతేకాకుండా రెహమాన్‌కు మరో అరుదైన గౌరవం కూడా దక్కింది. కెనడాలోని మారఖమ్ నగరంలో ఒక వీధికి రెహమాన్ పేరు పెట్టారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- — A.R.Rahman (@arrahman) August 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
— A.R.Rahman (@arrahman) August 29, 2022
">— A.R.Rahman (@arrahman) August 29, 2022
తెలుగులోనూ ఆయన మంచి మ్యూజికే అందించారు. 'పల్నాటి పౌరుషం', 'నాని', 'సూపర్ పోలీస్', 'ఏ మాయ చేసావె', 'కొమరం పులి' సినిమాలకు రెహమాన్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఆయన చెేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. అందులో రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్', 'RC 16', రజనీకాంత్ 'లాల్ సలామ్', 'ధనుశ్ 50' సినిమాలు ఉన్నాయి.
తండ్రి బాటలో తనయ.. మ్యూజిక్ డైరెక్టర్‌గా రెహమాన్ కూతురు ఖతీజా.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?
RC 16: చెర్రీ సినిమాకు రెహమాన్ మ్యూజిక్.. ఆ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా!