ETV Bharat / entertainment

'యానిమల్'​ మూవీలో సుందరమైన ప్యాలెస్​ - ఆ స్టార్​ హీరోదేనట - సైఫ్​ అలీఖాన్ ప్యాలెస్​

Animal Movie Palace : రణ్​బీర్​ కపూర్ - సందీప్​ రెడ్డి కాంబోలో వచ్చిన యానిమల్ మూవీ బాక్సాఫీస్​ వద్ద ఎటువంటి సెన్సేషన్​ క్రియేట్​ చేస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులోని సాంగ్స్​, సీన్స్​కు కనెక్ట్​ అయిన ప్రేక్షకులు ఈ సినిమా గురించి నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని హీరో నివసించే ప్యాలెస్​పై అందరి దృష్టి పడింది. ఇంతకీ అది ఎవరిదంటే ?

Animal Movie Palace
Animal Movie Palace
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 5, 2023, 12:46 PM IST

Updated : Dec 5, 2023, 1:50 PM IST

Animal Movie Palace : మూవీ లవర్స్​ను ఎంతగానో ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్​ చేస్తోంది రణ్​బీర్​ కపూర్ 'యానిమల్' మూవీ. పాన్ఇండియా లెవెల్​లో డిసెంబర్​ 1 న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మూడు రోజుల్లో రూ. 300 కోట్ల మార్క్​ దాటి ట్రెండ్​ అవుతోంది. స్టోరీ, స్టార్స్, సాంగ్స్​, యాక్షన్స్​ సీన్స్ ఇలా సినిమాలోని అన్ని ఎలిమెంట్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా ఈ చిత్రంలో హీరో ఫ్యామిలీ నివసించినట్లు చూపించిన భవనం అందరి దృష్టిని ఆకర్షించింది. పెద్ద పెద్ద గదులతో సుందరంగా ఉండే ఈ భవనం గురించి నెట్టింట చర్చలు మొదలయ్యాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఈ ప్యాలెస్​ గురించి నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఇది షూటింగ్​ సెట్టా లేకుంటే నిజమైనదేనా అని ఆరా తీస్తున్నారు. అయితే ఈ బిల్డింగ్​ ఎవరిదంటే ?

Pataudi Palace Owner : పటౌడీ వారసుడు సైఫ్​ అలీ ఖాన్​ ఈ భవనానికి అసలైన యజమాని. గత కొన్నేళ్లుగా ఆ వంశానికి చెందిన ఈ సువిశాల భవనం సుమారు పది ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 150 గదులు, ఏడు పడక గదులతో ఉన్న ఆ ప్యాలెస్​ పురాతమైన వస్తువులతో చెక్కు చెదరకుండా ఉంది. ఇక దీని విలువ సుమారు రూ. 800 కోట్ల మేర ఉంటుందని అంచనా. గతంలో నవాబ్ ఇఫ్తికార్ ఖాన్, ఆ తర్వాత మన్సూర్ అలీఖాన్ ఆధీనంలో ఉన్న ఈ ప్యాలెస్​ ఇప్పుడు సైఫ్​కు సొంతమైంది. ఇందులో తన ఫ్యామిలీతో సైఫ్​ నివసిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను అప్పుడప్పుడు సైఫ్​ భార్య కరీనా కపూర్​ ఖాన్​ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తుంటారు. అంతే కాకుండా ఈ భవనం పలు బాలీవుడ్​ సినిమాల్లోనూ కనిపించిందని నెటిజన్ల మాట.

Animal Movie Cast : ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. తండ్రీ కొడుకుల సెంటిమెంట్​తో రూపొందిన ఈ సినిమాలో రణ్​బీర్​ కపూర్​తో పాటు రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రి, బాబీ దేఓల్​, అనిల్‌ కపూర్ కీలక పాత్రలు పోషించారు. సందీప్ రెడ్డి తన మార్క్ డైరెక్షన్​తో ఈ సినిమాను తీర్చిదిద్ది ప్రేక్షకుల్లో మరింత హైప్​ను పెంచారు. ​మూడుగంటల ఇరవై నిమిషాల నిడివి ఉన్నప్పటికీ ఈ చిత్రం ప్రస్తుతం మంచి టాక్ అందుకుంటోంది. అక్కడక్కడ నెగిటివ్​ టాక్ అందుకున్నప్పటికీ.. అవేవి నిజం కావంటూ ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'యానిమల్​' మూవీలో బోల్డ్​ బ్యూటీ - ఎవరీ తృప్తి ?

3 రోజుల్లో రూ. 300 కోట్లు - వీకెండ్​లో భారీ స్థాయిలో పైసా వసూల్​

Last Updated : Dec 5, 2023, 1:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.