ETV Bharat / entertainment

కుమార్తెకు బిగ్​బీ కాస్ట్​లీ గిఫ్ట్​ - విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే! - అమితాబ్​ బచ్చన్​ బంగ్లా

Amitabh Bacchan Bungalow : బాలీవుడ్ స్టార్ హీరో బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​ తన కుమార్తె శ్వేతా నందాకు అద్భుతమైన బహుమతిని ఇచ్చారు. తన పేరిట ఉన్న ఓ బంగ్లాను తన కూతురికి గిఫ్ట్​ చేశారట. ఆ విశేషాలు మీ కోసం..

Amitabh Bacchan Bungalow
Amitabh Bacchan Bungalow
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2023, 12:17 PM IST

Updated : Nov 25, 2023, 1:02 PM IST

Amitabh Bacchan Bungalow : బాలీవుడ్ స్టార్ హీరో బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​ తన కుమార్తె శ్వేతా నందా అద్భుతమైన బహుమతిని ఇచ్చారు. తన పేరిట ఉన్న ఓ బంగ్లాను తన కూతురి పేరుపై మార్చేశారట. ఇప్పటికే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తయ్యాయని నెట్టింట టాక్​ నడుస్తోంది. అయితే తన తనయకు అమితాబ్​ ఇచ్చిన ఆ బంగ్లా విలువ తెలుసుకుని ఫ్యాన్స్ షాకవుతున్నారు.

ముంబయిలో అమితాబ్​కు దాదాపు మూడు ఇళ్లులు ఉన్నాయి. అందులో ఒకటి 'ప్రతీక్ష', ఇంకోటి 'జల్సా'ఇక మూడోది'జనక్'. తన కెరీర్​లోని వేర్వేరు దశల్లో అమితాబ్ ఈ నివాసాల్లో ఉన్నారు. అయితే ప్రస్తుతం అమితాబ్.. తన ఫ్యామిలీతో 'జల్సా' అనే సువిశాల భవనంలో ఉంటున్నారు. అయితే తను ఇష్టంగా చూసుకున్న 'ప్రతీక్ష' అనే బంగ్లాను తాజాగా తన కూతురు శ్వేతా నందకు గిఫ్ట్‌గా రాసి ఇచ్చేశారట బిగ్ బి.

ఇక జుహూలోని విఠల్‌నగర్ కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీలో రెండు ప్లాట్స్‌లో ఉన్న ఈ బంగ్లా విలువ దాదాపు రూ.50.63 కోట్లు ఉంటుందని సమాచారం. నవంబర్ 8న రెండు వేర్వేరు గిఫ్ట్ డీడ్స్‌ను సిద్ధం చేసిన అమితాబ్​.. అందులో భాగంగా 'ప్రతీక్ష'ను శ్వేత నందా పేరు మీద మార్చారట. అంతే కాకుండా ఈ రిజిస్ట్రేషన్​ కోసం స్టాంప్ డ్యూటీ రుసుముగా రూ.50.65 లక్షలను కూడా చెల్లించారట.

Shwetha Nanda Career : ఇక కూతురు శ్వేతా నందా.. ఓ రచయితగా, వ్యాపారవేత్తగా అందరికీ సుపరిచితురాలే. 'ప్యారడైజ్ టవర్స్' అనే నవలను శ్వేత రాశారు. ఇక ఈమెకు ఇద్దరు సంతానం. కుమార్తె నవ్య నవేలీ నందా.. నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు తనయుడు అగస్త్య నంద.. ఇప్పటికే సినిమా రంగంలోకి వచ్చేశాడు. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'ది ఆర్కైవ్స్'తో సినీ తెరంగేట్రం చేయనున్నాడు.

Amitabh Bacchan Movies List : ఇక అమితాబ్​ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో సందడి చేస్తున్నారు. ఇటీవలే 'గణ్​పత్​'​ అనే బాలీవుడ్​ సినిమాలో కీలక పాత్ర పోషించిన ఆయన.. దీంతో పాటు ప్రభాస్​ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న 'కల్కి 2898 ఏడీ' రజనీకాంత్​ జ్ఞానవేల్​ కాంబోలో తెరకెక్కుతున్న 'తలైవర్​ 170' షూటింగుల్లో బిజీగా ఉన్నారు.

Indian Actors Multiple Roles : ఒకే సినిమాలో 45 పాత్రలతో ప్రపంచ రికార్డు.. అది కమల్, అమితాబ్ కాదు.. ఆ నటుడు ఎవరంటే..

ఫైనల్ మ్యాచ్​కు రావొద్దు - అమితాబ్​కు నెటిజన్లు స్వీట్ వార్నింగ్!

Last Updated : Nov 25, 2023, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.