Jani master new movie ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం యథారాజా తథా ప్రజా. పొలిటికల్ సెటైరికల్ గా శ్రీనివాస విట్టల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. ఓంమూవీ క్రియేషన్స్, శ్రీకృష్ణ మూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కార్తికేయ2 నిర్మాత వివేక్ కూచిబొట్ల ముఖ్యఅతిథిగా హాజరై చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ చిత్రంలో జానీ మాస్టర్ తోపాటు సినిమా బండి ఫేమ్ వికాస్ మరో కీలకపాత్రలో నటిస్తుండగా... నూతన అమ్మాయి శ్రష్టి వర్మ కథానాయికగా తెలుగుతెరకు పరిచయంకాబోతుంది.
Allarinaresh new movie shooting start అల్లరి నరేష్, విజయ్ కనకమేడల దర్శకత్వంలో విడుదలైన చిత్రం నాంది. బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకొని విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇప్పుడు ఈ ఇద్దరి కలయికలో మరో నూతన చిత్రం ఉగ్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. షైన్ స్క్రీన్ పతాకంపై సాగు గారపాటి, హరీశ్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. అల్లరి నరేష్ పై చిత్రీకరించి ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ నివ్వగా... దర్శకుడు అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. దామోదర ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్ గా నిర్మించనున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల మొదటివారం నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. ఉగ్రం చిత్రం నాందికి కొనసాగింపు చిత్రం కాదని చిత్ర బృందం స్పష్టం చేసింది.
Alluarjun pushpa 2 shooting ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, విలక్షణ దర్శకుడు సుకుమార్ కలయికలో విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం పుష్ప ది రైజ్. బాక్సాఫీసు వద్ద సుమారు 350 కోట్ల రూపాయలు సాధించి 2021 సంవత్సరంలో అతిపెద్ద కమర్షియల్ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపు కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తోన్న క్రమంలో దర్శకుడు సుకుమార్ పుష్ప ది రూల్ పేరుతో రెండో భాగాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. మైత్రీమూవీ మేకర్స్ నిర్మాణ కార్యాలయంలో జరిగిన కార్యక్రమాల్లో చిత్ర బృందం పాల్గొంది. అల్లు అర్జున్ విదేశాల్లో ఉండటం కారణంగా ఈ వేడుకలకు హాజరుకాలేకపోయారు. పుష్ప ది రూల్ చిత్రీకరణను త్వరలోనే మొదలుపెట్టనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
AlluArjun At Newyork Parade: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' వేడుకల్లో భాగంగా న్యూయార్క్‌లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ నిర్వహించిన భారీ పరేడ్‌కు ఆయన గ్రాండ్ మార్షల్‌గా వ్యవహరించారు. దీనికి సంబంధిత సర్టిఫికెట్‌ను న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్.. అర్జున్‌కి అందించారు. ఈ ఫొటోతోపాటు ఆడమ్స్‌తో కలిసి దిగిన 'తగ్గేదే లే' మ్యానరిజం స్టిల్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు బన్నీ. ఎఫ్‌ఐఏ చేపట్టిన ర్యాలీలో అల్లు అర్జున్‌తోపాటు పలువురు ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఈ పరేడ్‌లో సుమారు 5 లక్షల మంది పాల్గొన్నారని సమాచారం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: హీరోకాక ముందు చిరు నటించిన సీరియల్ తెలుసా