ETV Bharat / entertainment

పుష్ప-2 కొత్త ట్విస్ట్​.. ఫుటేజ్​ నచ్చక మొత్తం​ డిలీట్​ చేసిన సుక్కూ.. రిలీజ్​ ఇప్పట్లో కష్టమే! - పుష్ప 2 బ్రేక్​

ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​ ఫ్యాన్స్​కు బ్యాడ్​ న్యూస్​!.. పుష్ప-2 షూటింగ్​కు లాంగ్​ బ్రేక్​ పడిందట. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్​ ఫుటేజీతో డైరెక్టర్ సుకుమార్​ సంతృప్తి చెందలేదట. మరో మూడు నెలల తర్వాత మళ్లీ చిత్రీకరణ ప్రారంభం కానుందట.

Allu Arjun
Allu Arjun
author img

By

Published : Apr 3, 2023, 7:57 PM IST

టాలీవుడ్‌లో సెట్స్​పై ఉన్న మోస్ట్ క్రేజీయెస్ట్‌ ప్రాజెక్టుల్లో ఒకటి పుష్ప ది రూల్‌ మూవీ. స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమాకు పుష్ప ది రూల్ సీక్వెల్ తెరకెక్కుతోంది. ఈ సీక్వెల్ ప్రాజెక్ట్‌తో మరోసారి బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల వర్షం కురిపించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం పుష్ప.. ది రూల్ షూటింగ్ దశలో ఉంది.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పుష్ప-2 చిత్రీకరణ ప్రస్తుతం నిలిపివేశారట. ఎందుకంటే దర్శకుడు సుకుమార్​.. ఇప్పటివరకు చిత్రీకరించిన దానితో సంతృప్తి చెందలేదట. ఆ ఫుటేజీలను డిలీట్​ చేసే ఆలోచనలో ఉన్నారట. మళ్లీ షూటింగ్​ మూడు నెలల తర్వాత ప్రారంభించనున్నారట. దీని ప్రకారం చూసుకుంటే ఈ సినిమా 2023లో విడుదలయ్యే అవకాశం లేదు. అయితే పుష్ప 2 షూటింగ్​పై వచ్చిన ఈ వార్తలపై చిత్రబృందం స్పందించలేదు.

ఇక.. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప ది రూల్ 3 నిమిషాల యాక్షన్‌ టీజర్​ను లాంచ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పటికే సుకుమార్ టీం టీజర్‌ను రెడీ చేశారని, ప్రస్తుతం మ్యూజిక్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌పై పనిచేస్తున్నారని టాక్‌ నడిచింది. యాక్షన్‌ టీజర్‌ ద్వారా సినిమా ఎలా ఉండబోతుందో సుకుమార్‌ హింట్ ఇవ్వబోతున్నట్టు జోరుగా మాట్లాడుకున్నారు. మరి ఇప్పుడు వచ్చిన తాజా వార్తతో టీజర్​ రిలీజ్​ చేస్తారో లేదో చూడాలి.

ఇటీవలే ఈ సినిమా గురించి మరో వార్త కూడా చక్కర్లు కొట్టింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు 200 రోజులకు పైగా సమయం పడుతుందట. ఈ మూవీ యాక్షన్ ఎపిసోడ్స్‌ను పుష్ప సినిమాను మించి తెరకెక్కించేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారట. మొత్తానికి ఈ సినిమా పుష్పను మించి వేరే లెవెల్​లో తెరకెక్కిస్తున్నారట. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాపై మేకర్స్​ ఎటువంటి అప్డేట్​ ఇవ్వలేదు.

పుష్ప ది రూల్ సీక్వెల్‌ ప్రాజెక్ట్ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్​పై భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది. రెండో పార్టులోనూ కన్నడ బ్యూటీ రష్మిక మందన్న అల్లు అర్జున్ సరసన ఫిమేల్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. పార్ట్​-1 కు సూపర్ హిట్‌ ఆల్బమ్‌ అందించిన రాక్‌ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ సీక్వెల్​కు కూడా అదిరిపోయే పాటలను రెడీ చేసినట్టు టాక్. దీనికి తోడు చంద్రబోస్ సాహిత్యం కూడా పుష్పను మించి ఉంటుందని సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.