ETV Bharat / entertainment

'పుష్ప-2' ఖర్చులో 'అస్సలు తగ్గేదే లే' అంటున్న ప్రొడ్యూసర్లు! - పుష్ప2 సుకుమార్​ నిర్మాతం

'పుష్ప 2' సినిమా విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంచనాలు పెంచేశారు. 'ఊర్వశివో రాక్షసివో' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న ఆయన పుష్ప 2 గురించి మాట్లాడుతున్నప్పుడు 'అస్సలు తగ్గేదే లే' అంటూ చిన్న అప్డేట్​ ఇచ్చారు. అయితే ఖర్చు విషయంలో నిర్మాతలు కూడా ఇప్పుడు అదే మాట అంటున్నారట.

Allu Arjun Pushpa2 Movie Update:
Allu Arjun Pushpa2 Movie Update:
author img

By

Published : Nov 8, 2022, 6:51 PM IST

Allu Arjun Pushpa2 Movie Update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించనున్న సినిమా 'పుష్ప 2'. త్వరలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది. పాన్ ఇండియా స్థాయిలో 'పుష్ప' సూపర్ సక్సెస్ సాధించడంతో... ఇప్పుడు అందరూ 'పుష్ప 2' కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా సెట్స్ మీదకు వెళ్లక ముందే అల్లు అర్జున్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.

'ఊర్వశివో రాక్షసివో' సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ''ఇప్పుడు నన్ను అందరూ పుష్ప గురించి అడుగుతున్నారు. వారికి చిన్న అప్డేట్​ ఇస్తా... 'పుష్ప 1' తగ్గేదే లే అయితే 'పుష్ప 2' అస్సలు తగ్గేదేలే. నేనూ ఈ సినిమా కోసం ఎగ్జైట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాను'' అని బన్నీ చెప్పారు. బడ్జెట్ విషయంలో నిర్మాతలు కూడా అదే మాట అంటున్నారట.

'పుష్ప' సక్సెస్ అవ్వడంతో 'పుష్ప 2'ను భారీగా తీయాలని డిసైడ్ అయినట్లు బన్నీ సన్నిహిత వర్గాల సమాచారం. ఇప్పటికే బడ్జెట్ గురించి నిర్మాతలతో అల్లు అర్జున్ డిస్కస్ చేశారని టాక్. సుకుమార్ ఎంత అడిగితే అంత ఇవ్వమని, ఖర్చు పరంగా ఆయన మీద ఒత్తిడి తీసుకురావద్దని, ఇంత అని లెక్కలు వేసుకోవద్దని చెప్పేశారట. సో బడ్జెట్ విషయంలో సుకుమార్‌కు ఫుల్ ఫ్రీడమ్ లభించినట్టే అని తెలుగు సినిమా ఇండస్ట్రీ టాక్​.

'ఊర్వశివో రాక్షసివో' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో అల్లు అర్జున్ ఆప్తుడు 'బన్నీ' వాసు సైతం 'పుష్ప 2' మీద అంచనాలు పెంచారు. ''2023లో వస్తున్న 'పుష్ప 2'తో స్క్రీన్లు పగిలిపోబోతున్నాయి. ఇది రాసిపెట్టుకోండి'' అని ఆయన అన్నారు. ఈ మాటలకు తోడు భారీ బడ్జెట్ ఉండటంతో సినిమా ఎలా తీస్తున్నారో? అని ఇండస్ట్రీ కూడా వెయిట్ చేస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్ 'పుష్ప 2' ప్రొడ్యూస్ చేస్తున్నారు. అల్లు అర్జున్ సరసన రష్మిక కథానాయికగా.. ఫహాద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 'పుష్ప' విడుదలైన తర్వాత 'తగ్గేదే లే' పాపులర్ అయ్యింది. ఇప్పుడు 'అస్సలు తగ్గేదే లే' అంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.